Box Office Stars: సాధారణంగా ఏ సినిమా అయినా రూ.200 కోట్లు కలెక్షన్స్ సాధించడం అంటే చిన్న విషయమేమి కాదు. అందులోనూ సౌత్ ఇండియాలో ఈ కలెక్షన్స్ ను అందుకోవడం అంత ఈజీ ఏం కాదని చెప్పుకోవచ్చు. కానీ ఓ ముగ్గురు హీరోలకు మాత్రం ఈ రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అనేది చాలా సింపుల్ అని తెలుస్తోంది. చాలా సులువు సూత్రంగా ఆ హీరోలు కలెక్షన్స్ ను సాధించగలరు.
రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించే హీరోల్లో ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఈయనకు ఈ టార్గెట్ చాలా చిన్న విషయం. దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం బహుబలి. ఈ సినిమా ప్రభాస్ సినీ కెరియర్ లోనే మొదటి రూ.200 కోట్ల కలెక్షన్స్ మూవీ అన్న సంగతి దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అదేవిధంగా బాహుబలి -2 సైతం తొలి రోజే 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తరువాత వచ్చిన సాహో మూవీ కూడా రెండు రోజుల్లోనే ఈ టార్గెట్ ను చేరుకుంది. తాజాగా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.
ఈ లిస్టులో రెబల్ స్టార్ ప్రభాస్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వినిపిస్తోంది. హిట్స్, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టడంలో ఆయన సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. భారీ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యే రజనీకాంత్ మూవీ కలెక్షన్స్ విజయాన్ని బట్టి పెరుగుతాయి. ఈయన నటించిన సినిమాల్లో రోబో, 2.ఓ, కబాలి, పేట, జైలర్ వంటి సినిమాలు రూ.200 కోట్ల క్లబ్ లో చేరాయి.
తరువాత ఇళయదలపతి విజయ్.. ఈయన హీరోగా నటించిన సుమారు ఏడు చిత్రాలు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసుతో పాటు ఇటీవల వచ్చిన లియో చిత్రాలు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టాయి.
విజయ్ తరువాత అల్లు అర్జున్ ఈ జాబితాలో ఉన్నారు. అల వైకుంఠపురం, పుష్ప సినిమాలు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఈ క్లబ్ లో చేరారని తెలుస్తుంది.