https://oktelugu.com/

హీరోలు తగ్గించుకుంటేనే వాటికి మనుగడ !

‘కరోనా’ మొత్తానికి థియేటర్ల వ్యవస్థలో చాల మార్పులు తెచ్చేలా ఉంది. ప్రస్తుతానికి అయితే దేశవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి అసలు బాగాలేదు. ఏ వ్యాపారంలోనైనా కొన్ని లాభనష్టాలు ఉంటాయి. థియేటర్స్ బిజినెస్ లో నష్టాలు మాత్రమే ఉంటున్నాయి. దీనికితోడు కరోనాతో అసలు ఎన్ని థియేటర్స్ మనుగడలో ఉంటాయనేది పెద్ద క్వశ్చన్ గా మారింది. ఇపుడున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో సింగిల్ థియేటర్ల మనుగడ ఇక కష్టమే అని తేల్చేస్తున్నాయి. నిజానికి ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ […]

Written By:
  • admin
  • , Updated On : April 27, 2021 / 04:42 PM IST
    Follow us on

    ‘కరోనా’ మొత్తానికి థియేటర్ల వ్యవస్థలో చాల మార్పులు తెచ్చేలా ఉంది. ప్రస్తుతానికి అయితే దేశవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి అసలు బాగాలేదు. ఏ వ్యాపారంలోనైనా కొన్ని లాభనష్టాలు ఉంటాయి. థియేటర్స్ బిజినెస్ లో నష్టాలు మాత్రమే ఉంటున్నాయి. దీనికితోడు కరోనాతో అసలు ఎన్ని థియేటర్స్ మనుగడలో ఉంటాయనేది పెద్ద క్వశ్చన్ గా మారింది. ఇపుడున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో సింగిల్ థియేటర్ల మనుగడ ఇక కష్టమే అని తేల్చేస్తున్నాయి.

    నిజానికి ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ కౌంట్ అనేది చాల కాలంగా తగ్గిపోతూ వస్తోంది. కారణం ఏది అయితే ఏమి.. సింగిల్ థియేటర్స్ కు చాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా హౌస్ ఫుల్ అనే బోర్డులు ఒక్క పెద్ద సినిమాల విషయంలో తప్ప, మళ్ళీ ఎక్కడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించవు. పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి, కేవలం ఆ పది సినిమాలు నమ్ముకుని సంవత్సరాల తరబడి థియేటర్స్ ను ఎలా నడిపేది ? ఎలాగూ టిక్కెట్లు తెగక సింగిల్ థియేటర్ల యజమానులు నష్టాలూ భరించలేకపోతున్నారు.

    ఇంకా కరెక్ట్ గా మాట్లాడుకుంటే.. కరెంట్ బిల్లులు, చివరకు మెయింటెనెన్స్ లను కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు భరించలేకపోతున్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు గొడౌన్లుగా మారిపోతూ వస్తున్నాయి. మరికొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లను కూల్చేసి, వాటి ప్లేస్ ల్లో అపార్ట్ మెంట్లు, షాపులు కట్టేస్తూ వస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పుండు మీద కారంలా కరోనా వచ్చి, ఆ పుండును శరీరం అంతా పాకించేలా ఉంది.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు మనుగడ సాగించాలంటే ఒక్కటే మార్గం కనిపిస్తోంది. టిక్కెట్ రేట్లు పెంపు. ఈ విషయంలో ప్రభుత్వాలు సహకరించేలా లేవు. అయినా ఎందుకు సహకరించాలి ?. ఒక్కో స్టార్ హీరో ఒక్కో సినిమాకి ఏభై కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటూ.. థియేటర్స్ తో పాటు మిగిలిన వ్యవస్థలను కూడా తమకు సంబంధం లేదన్నట్టు వదిలేస్తున్నారు. కాబట్టి బయ్యర్లు బాగు పడాలన్నా.. థియేటర్లు బతకాలన్నా ముందు హీరోలు తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకుని మిగిలిన వ్యవస్థలకు ఊపిరి పోయాలి. అప్పుడే, థియేటర్లకు మనుగడ ఉంటుంది, సినిమాలకూ పదికాలాల పాటు డిమాండూ ఉంటుంది.