
కరోనా.. లాక్డౌన్ కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర సంక్షోభానికి గురైంది. తొమ్మిది నెలలుగా థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఈరంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలమంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కరోనా సమయంలో చిత్ర పరిశ్రమను ఏదైనా ఆదుకుందంటే అది ఓటీటీ మాత్రమే.
Also Read: ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్..!
నిర్మాత బాగుంటేనే సినిమా బ్రతుకుంది. అలాంటి నిర్మాత కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓవైపు థియేటర్లు మూతపడటం.. మరోవైపు షూటింగులు నిలిచిపోవడంతో ఏమిచేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా నిర్మాణం కోసం తెచ్చిన అప్పులకు వడ్డీల భారం పెరిగిపోతుండటంతో గత్యంతరం లేక నిర్మాతలు సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయమే ఆ తర్వాత వారిపాలిట వరంగా మారింది.
కరోనా టైంలో ఓటీటీ బిజినెస్ మూడుపువ్వులు.. ఆరుకాయలు అన్న చందంగా మారింది. ప్రతీఒక్కరికి ఇంటర్నెట్.. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం కూడా ఓటీటీలకు బాగా కలిసొచ్చేంది. లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవడం ఓటీటీలకు వరంలా మారింది. కరోనాతో లాభపడిన రంగం ఏదైనా ఉందంటే కూడా ఓటీటీనే కావడం విశేషం.
Also Read: మేకసూరి-2 రివ్యూ.. హిట్టా.. ఫ్లాపా?
లాక్డౌన్ సమయంలో ప్రముఖ ఓటీటీలైన అమెజాన్ ప్రైమ్.. నెట్ ప్లిక్స్.. ఆహా.. సన్ నెక్స్ట్.. డిస్నీ హాట్ స్టార్.. జీ5 వంటి ఓటీటీ కొత్త సినిమాలతో సత్తా చాటాయి. చిన్న సినిమాలు మొదలుకొని భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఓటీటీల్లోనే రిలీజయ్యాయి. అయితే ఓటీటీలో రిలీజైన 90శాతం సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాలు థియేటర్లలో విడుదలైతే మాత్రం నిర్మాతలు భారీగా నష్టపోయేవారనే టాక్ విన్పించింది.
స్టార్ హీరోలు సైతం తమ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో విడుదల చేయడంపై హ్యాపీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఓపెనింగ్ కలెక్షన్ల బెంగ.. సినిమాకు జనాలు వస్తారో రారో అనే టెన్షన్ లేకపోవడం.. హిట్.. ప్లాప్ తో సంబంధం లేకుండా నిర్మాతకు ఫ్రాఫిట్ వస్తుండటంతో హీరోలు సైతం ఓటీటీ రిలీజులపై ఆసక్తి చూపుతున్నారట. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ సినిమాలను ప్రతీఒక్కరు ఆదరిస్తుంటంతో ఓటీటీ రిలీజులపై హీరోలు హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్