Homeఎంటర్టైన్మెంట్Yash: సంచలనాలకు కేరాఫ్.. హీరో యశ్ జీవితం..!

Yash: సంచలనాలకు కేరాఫ్.. హీరో యశ్ జీవితం..!

Yash: ‘కేజీఎఫ్’ మూవీలో హీరో ఎలాగైతే కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి డాన్ గా మారుతాడో.. అచ్చంగా యశ్ జీవితంలోనూ అలాంటి ఘటనలు జరిగాయి. సామాన్య కుటుంబానికి చెందిన యశ్ సినిమాపై ఫ్యాషన్ తో ఈ రంగానికి వచ్చి అనుకున్న స్టార్డమ్ ను సొంతం చేసుకున్నాడు. కన్నడ సినిమా రంగానికి పరిమితమైన యశ్ ‘కేజీఎఫ్’ హిట్టుతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు.

KGF Chapter 2
KGF Chapter 2

హీరో యశ్ నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతడి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యశ్ జనవరి 8, 1986న కర్ణాటకలోని హాసన్ జిలాల్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి ఆర్టీసీ డ్రైవర్. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న యశ్ విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే బెంగళూరుకు వచ్చాడు.

కేవలం 300 రూపాయాలతో బెంగళూరు వెళ్లిన యశ్ తన బంధువుల ఇంటికి వెళ్లలేక కెంపెగౌడ బస్టాండ్ లో చాలా రాత్రులు గడిపాడట. ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు. తొలుత సీరియల్స్, సపోర్టింగ్ రోల్స్ చేసిన యశ్ ‘మెగ్గినా మనసు’ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాలో రాధిక పండిట్ హీరోయిన్ నటించింది. వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమా భారీ విజయం సాధించడంతోపాటు యశ్ కు అవార్డులను తీసుకొచ్చింది. తనకు లక్ ను తీసుకొచ్చిన రాధిక పండిట్ నే యశ్ 2016లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. కన్నడలో హీరోగా క్రేజ్ తెచ్చుకుంటున్న సమయంలో  యశ్ ‘కేజీఎఫ్’ మూవీలో నటించాడు. ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఓవర్ నైట్లో ఇండియన్ స్టార్ గా యశ్ మారిపోయాడు.

ప్రస్తుతం యశ్ ఒక్కో సినిమాకు రూ. 15కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. కాగా యశ్ ఏ బస్టాండ్లో అయితే నిద్రలేని రాత్రులు గడిపాడే అక్కడే అతడి ఫ్యాన్స్ రెండేళ్ల కింద భారీ కటౌట్ ఏర్పాటు చేసి అతడికి నీరాజనాలు పలికారు. 5వేల కేజీల భారీ కేక్ ను ఏర్పాటు చేసి ‘వరల్డ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ బర్త్ డే కేకు’ రికార్డును నెలకొల్పారు.

తాజాగా యశ్ నటించిన ‘కేజీఎఫ్-2’ విడుదలకు సిద్ధవుతోంది. ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కిరాగండూర్ ఈ మూవీని నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. యశ్ పుట్టిన రోజును పురస్కరించుకొని కేజీఎఫ్-2 మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి విషెష్ చెప్పారు.

KGF Chapter2 TEASER |Yash|Sanjay Dutt|Raveena Tandon|Srinidhi Shetty|Prashanth Neel|Vijay Kiragandur

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version