Hero Yash: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. యష్ అంటే.. నార్త్ ఇండస్ట్రీ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక కంగనా లాంటి హీరోయిన్ అయితే.. యశ్ ను అమితాబ్ తో పోల్చింది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తర్వాత ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ యశ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ అతన్ని ప్రత్యేకంగా అభిమానిస్తున్నారు.
మరి ఇంతకీ యశ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా ? తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో యష్ తనకిష్టమైన హీరోయిన్ విషయంలో ఆసక్తికర కామెంట్లు చేశాడు.
Also Read: RRR OTT: ఓటీటీ రాక పై మరో ట్విస్ట్.. ఎప్పుడు ? ఎక్కడో తెలిస్తే షాకే !
యశ్ మాటల్లోనే.. ‘నాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆమె నటన అంటే చాలా ఇష్టం. అందుకే, నేను ఎక్కువగా ఆమె సినిమాలు చూస్తాను.
నాకు దీపికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది. ఒకవేళ భవిష్యత్తులో దీపికాతో నటించే అవకాశం వస్తే.. ఆ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోను. అంటూ తన మనసులోని కోరికను యశ్ బయటపెట్టాడు. ఎలాగూ ప్రస్తుతం దీపిక సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తిగానే ఉంది. మరి ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం దీపికా ‘ప్రాజెక్ట్ K’ లో హీరోయిన్‌గా నటిస్తోంది.
కాబట్టి, ఆమె యష్ సరసన కూడా నటించడానికి అంగీకరిస్తోంది. యశ్ తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. మొత్తమ్మీద ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ అద్భుత విజయాన్ని సాధించింది. తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.78 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.
8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ. 66.15 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో రూ. 8.85 కోట్ల షేర్ ను రాబడితే.. ఇక ఈ సినిమా లాభాల బాట పడుతుంది. కాబట్టి ఈ సినిమా ఈజీగా బ్యాలెన్స్ ఎమౌంట్ రాబట్టడం ఖాయం.
Recommended Videos: