Vishwak Sen Marriage: హీరో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయం వెల్లడించారు. విశ్వక్ సేన్ తాను కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. ఇంస్టాగ్రామ్ లో విశ్వక్ సేన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంత కాలం నన్ను అభిమానించిన, ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. మీ అందరికీ ఓ ముఖ్య విషయం వెల్లడించాలి. జీవితంలో మరో దశలో అడుగుపెట్టబోతున్నాను… అని విశ్వక్ సేన్ ఒక నోట్ విడుదల చేశారు.
నేను కుటుంబాన్ని ప్రారంభించబోతున్నాను అని ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. దీంతో విశ్వక్ ప్రకటన పెళ్లి గురించే అంటున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. విశ్వక్ మాత్రం ఎక్కడా తాను వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించలేదు. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను అన్నాడు. కుటుంబం అంటున్నాడు కాబట్టి ఇది పెళ్లి వార్తే అని జనాలు ఫిక్స్ అయ్యారు. ఇక అభిమానులు ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. 28 ఏళ్ల విశ్వక్ సేన్ 2017లో పరిశ్రమలో అడుగుపెట్టాడు. వెళ్ళిపోమాకే ఆయన మొదటి చిత్రం.
ఈ నగరానికి ఏమైంది?, ఫలక్ నుమా దాస్ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆయన గత చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు కూడా విశ్వక్ సేనే. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఇది పీరియాడిక్ విలేజ్ పొలిటికల్ డ్రామా అని తెలుస్తుంది. విడుదలైన ప్రోమో ఆకట్టుకుంది.
అలాగే మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బేబీ మూవీలో విశ్వక్ సేన్ నటించాల్సి ఉంది. అయితే సాయి రాజేష్ ని విశ్వక్ రిజెక్ట్ చేశాడు. కనీసం కథ కూడా వినలేదట. ఈ విషయంలో విశ్వక్ సేన్- సాయి రాజేష్ మధ్య సోషల్ మీడియా వార్ నడిచింది. విశ్వక్ సేన్ తరచుగా వివాదాల్లో ఉంటారు. గతంలో కూడా విశ్వక్ పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు.