https://oktelugu.com/

Hero Vishal : న్యూయార్క్ లో అమ్మాయితో హీరో విశాల్, కెమెరాను చూసి పరుగు… వైరల్ గా సంచలన వీడియో

అలాగే నిజంగా ఆ వీడియోలో ఉంది విశాలే అనడానికి ఆధారం లేదు. ఇక ఈ ఏడాది మార్క్ ఆంటోని చిత్రంతో విశాల్ భారీ హిట్ కొట్టాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2023 / 08:31 PM IST
    Follow us on

    Hero Vishal : హీరో విశాల్ అడ్డంగా బుక్ అయ్యాడు. క్రిస్మస్ వేడుకల కోసం న్యూయార్క్ వెళ్లిన హీరో అక్కడ అమ్మాయితో కనిపించాడు. కెమెరా కంటికి దొరికానని తెలిసి ముఖం దాచుకుని పరుగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. విశాల్ పై ఎఫైర్ రూమర్స్ చాలానే ఉన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ చాలా కాలం రిలేషన్ లో ఉన్నాడు. వీరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. కారణం తెలియదు కానీ, ఇద్దరూ విడిపోయారు. నడిఘర్ సంఘం ఎన్నికల విషయంలో వరలక్ష్మి పేరెంట్స్ విశాల్ పై ఆరోపణలు చేశారు.

    అనంతరం లక్ష్మి మీనన్ తో ఎఫైర్ అంటూ వార్తలొచ్చాయి. వీరిద్దరూ పాండియనాడు, నాన్ సిగప్పు మనితాన్ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే కథనాలు వెలువడ్డాయి. వీటిని విశాల్ ఖండించారు. కాగా హైదరాబాద్ కి చెందిన ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. తెలియని కారణాలతో ఈ వివాహం ఆగిపోయింది.

    తాజాగా న్యూయార్క్ నగరంలో విశాల్ ఒక అమ్మాయితో కంటబడ్డాడు. రాత్రివేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న విశాల్ ని ఒక వ్యక్తి గురించాడు. విశాల్ అని పిలిచాడు. తిరిగి చూసిన విశాల్… వీడియో తీస్తున్నారని తెలిసి ముఖాన్ని దాచుకున్నాడు. ఆ అమ్మాయితో పాటు అక్కడి నుండి జారుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి ఎవరనేది తెలియలేదు.

    అలాగే నిజంగా ఆ వీడియోలో ఉంది విశాలే అనడానికి ఆధారం లేదు. ఇక ఈ ఏడాది మార్క్ ఆంటోని చిత్రంతో విశాల్ భారీ హిట్ కొట్టాడు. ఇది వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒక ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కిన మార్క్ ఆంటోని అలరించింది. నెక్స్ట్ విశాల్ రత్నం టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. హరి దర్శకుడిగా పని చేస్తున్నాడు. అలాగే తుప్పరివాలన్ సీక్వెల్ లో నటిస్తున్నాడు.