Hero Vijay: రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్టార్డం తెచ్చుకున్న హీరో విజయ్. ఓ దశాబ్ద కాలంగా విజయ్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆయన రజినీకాంత్ ని సైతం వెనక్కి నెట్టే పరిస్థితి నెలకొంది. ఫ్యాన్ బేస్ లో రజినీకాంత్ కి విజయ్ ఏ మాత్రం తక్కువ కాదు. రాజకీయాల్లోకి రావాలనుకున్న రజినీకాంత్ వెనకడుగు వేశారు. వయసు మీద పడటంతో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న తరుణంలో ఒక పార్టీని నడపటం, పర్యటనలు చేయడం సరికాదని ఆయన భావించారు.
సన్నిహితుల సలహా మేరకు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. రజినీకాంత్ నిర్ణయం విజయ్ లో మరింత జోష్ నింపింది. ఆయన వలె ఆలస్యం చేయకుండా వయసులో ఉన్నప్పుడే ప్రజా క్షేత్రంలోకి దిగాలని డిసైడ్ అయ్యాడు. దీనిపై కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మద్దతుతో కొందరు అభ్యర్థులు గెలిచారు. కాగా నేడు అధికారికంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటించారు. పార్టీ పేరు కూడా వెల్లడించారు.
తమిళం వెట్రి కజగం(TVK) విజయ్ పార్టీ పేరు. మరో మూడు నెలల్లో అన్ని రాష్ట్రాలతో పాటు తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్ పార్టీ కంటెస్ట్ చేయడం లేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అని విజయ్ స్పష్టం చేశారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. అదే సమయంలో విజయ్ వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్ కూడా చెప్పాడు.
ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేశాక, నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక చిత్రం, అనంతరం కార్తీక్ సుబ్బరాజ్ తో మరొక చిత్రం విజయ్ కమిట్ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేయనున్న 69వ చిత్రమే విజయ్ నటించే ఆఖరి మూవీ అవుతుందని సమాచారం. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నిర్ణయం ప్రకంపనలు రేపుతోంది. మరి విజయ్ మూడో ప్రత్యామ్నాయం అవుతాడో లేదో చూడాలి…