https://oktelugu.com/

Hero siddharth: మొన్న సమంత, నేడు సైనా.. పరువు పోగొట్టుకుంటున్న హీరో !

Hero siddharth: హీరో సిద్ధార్థ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తో వరుస సినిమాలు చేసిన సిద్ధార్థను పట్టించుకునే నాథుడు లేడు. ఎన్నో ఆశలు పెట్టుకొని మహాసముద్రం మూవీ చేస్తే అది కూడా బెడిసి కొట్టింది. మహాసముద్రం అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక హీరోగా సిద్ధార్థ కెరీర్ ముగిసినట్లే అనిపిస్తుంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ పుణ్యమా అని అడపాదడపా అవకాశాలు దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. సక్సెస్ లేకపోతే మైండ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 11, 2022 / 12:07 PM IST
    Follow us on

    Hero siddharth: హీరో సిద్ధార్థ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తో వరుస సినిమాలు చేసిన సిద్ధార్థను పట్టించుకునే నాథుడు లేడు. ఎన్నో ఆశలు పెట్టుకొని మహాసముద్రం మూవీ చేస్తే అది కూడా బెడిసి కొట్టింది. మహాసముద్రం అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక హీరోగా సిద్ధార్థ కెరీర్ ముగిసినట్లే అనిపిస్తుంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ పుణ్యమా అని అడపాదడపా అవకాశాలు దొరికే సూచనలు కనిపిస్తున్నాయి.

    Hero siddharth

    సక్సెస్ లేకపోతే మైండ్ పని చేయదు. చేతిలో పని లేకపోతే ఏం చేయాలో తోచలేదు. సిద్ధార్థ ప్రస్తుత మానసిక స్థితి చూస్తే అదే అనిపిస్తుంది. లేనిపోని విషయాలలో తలదూర్చుతూ.. వివాదాల పాలవుతున్నారు. ఆడవాళ్లంటే గౌరవం కూడా లేకుండా అనుచిత కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సిద్ధార్థ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో వివాదాస్పదమయ్యాయి.

    ప్రధాని మోడీ భద్రతా వైఫల్యాన్ని ఖండిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేయగా.. సదరు ట్వీట్ కి అవమానకర భాషలో సిద్ధార్థ కామెంట్ చేశారు. ఆమె ఆటను, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్వీట్ చేశారు. భారత క్రీడాకారిణిగా సైనా ప్రపంచ స్థాయిలో అనేక మరపురాని విజయాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో భారత్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారు. అలాంటి సైనా పై సిద్ధార్థ చేసిన కామెంట్ వివాదాస్పదంగా మారింది.

    Also Read: ఏపీ ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్ సంచలన ట్వీట్​

    సిద్ధార్థ తీరుపై క్రీడా, సామాజిక, రాజకీయాల రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిద్దార్థకు ఇది మొదటిసారి కాదు. హీరోయిన్ సమంతపై కూడా సిద్ధార్థ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమంత భర్త చైతూతో విడిపోతూ విడాకుల ప్రకటన చేసిన వెంటనే.. పరోక్షంగా ఆమెను టార్గెట్ చేశాడు.

    ఛీటర్స్ ఎప్పటికీ బాగుపడరంటూ దారుణమైన కామెంట్ చేశారు. విడాకుల కారణంగా వేదన అనుభవిస్తున్న సమంతపై అలా మానసిక దాడి చేయడాన్ని అందరూ ఖండించారు. నటుడిగా రెండు దశాబ్దాల అనుభవం ఉన్న సిద్ధార్థ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడడంతో సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.

    Also Read: ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ కే’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ !

    Tags