Bigg Boss 7 Telugu: శుక్రవారం ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ షురూ చేశారు. గులాబీ పురం టీమ్ మీద జిలేబీ పురం టీం నెగ్గిన నేపథ్యంలో… ఆ టీమ్ లో ఉన్న శివాజీ, అర్జున్, ప్రశాంత్, అశ్విని, ప్రియాంక, సందీప్ లకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ దక్కింది. ఇక వీరిలో ఎవరు కెప్టెన్ కావాలనే ప్రక్రియలో బిగ్ బాస్ ఓ ఫిట్టింగ్ పెట్టాడు… బజర్ మోగిన వెంటనే ఓడిపోయిన గులాబీ పురం సభ్యులు పరుగున వెళ్లి చైన్ దక్కించుకోవాలి. ఆ చైన్ దక్కిన వాళ్ళు… కెప్టెన్సీ రేసులో ఉన్న ఒకరిని తగు కారణాలు చెప్పి తప్పించాలి. వారి ఫొటో స్విమ్మింగ్ ఫూల్ లో ముంచేయాలి…
మొదట శోభా శెట్టి చైన్ దక్కించుకుంది.అశ్వినికి కెప్టెన్ అయ్యే సమర్థత లేదని చెప్పింది. అనంతరం అమర్… శివాజీకి అర్హత లేదంటూ ఆయన ఫోటో స్విమ్మింగ్ పూల్ లో ముంచేశాడు. ఇందుకు శివాజీ చాలా బాధపడ్డాడు. నాకు బిగ్ బాస్ వద్దు, షో వద్దు తలుపులు తీస్తే వెళ్ళిపోతా అన్నాడు. పూజా మూర్తి… ప్రశాంత్ ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ గా చేశాడంటూ అతన్ని ఎలిమినేట్ చేసింది. ప్రిన్స్ యావర్… ప్రియాంకకు ఝలక్ ఇచ్చాడు. అమర్ దీప్ గొడవల్లో ఆమె తలదూర్చుతుందని కారణం చెప్పి… ప్రియాంకను కెప్టెన్సీ రేసు నుండి తప్పించాడు.
దీంతో కెప్టెన్సీ రేసులో అర్జున్-సందీప్ మిగిలారు. బిగ్ బాస్ శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. తన భుజం గాయం ఎలా ఉందని అడిగాడు. చాలా నొప్పిగా ఉంటుంది. భరించలేకపోతున్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నాడు. అందరిలో లోలోపల ఏడుస్తున్నాను. అమర్ నువ్వు ఆడటం లేదంటే బాధేసింది, అని కన్నీరు పెట్టుకున్నాడు. గాయమైన తన చేతిని బిగ్ బాస్ కి చూపించాడు.
ఈ మధ్యలో మ్యాన్షన్ 24 యూనిట్ అయిన ఓంకార్, అవికా గోర్, వరలక్ష్మి శరత్ కుమార్, నందు ఇంట్లోకి వచ్చారు. ప్రత్యేకంగా సెటప్ చేసిన గదిలో ఇంటి సభ్యులతో ముచ్చటించారు. తమ సిరీస్ ని ప్రమోట్ చేసుకున్నారు. ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడారు. ఇక కెప్టెన్సీ రేసులో ఉన్న అర్జున్-సందీప్ మధ్య పోటీ జరగనుంది. టాస్క్ లో గెలిచి అర్జున్ నెక్స్ట్ హౌస్ కెప్టెన్ అయినట్లు సమాచారం.