Sharwanand Marriage: హీరో శర్వానంద్ వివాహ వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్ లోని పురాతన ప్యాలెస్ ఈ పెళ్లికి వేదికైంది. ఈ ఏడాది ప్రారంభంలో శర్వానంద్ రక్షిత రెడ్డి అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు. రక్షిత రెడ్డి హైకోర్ట్ న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె. ఇది పెద్దలు కుదిర్చిన వివాహంగా తెలుస్తుంది.
జూన్ 2, 3 తేదీలలో పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. నేడు హల్దీ ఫంక్షన్ జరిపారు. నవ జంట హల్దీ వేడుకలో మునిగి తేలారు. చక్కగా జలకాలాడారు. శర్వానంద్-రక్షిత రెడ్డిల హల్దీ వేడుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేపు ఘనంగా వివాహం జరగనుంది. రాజస్థాన్ లో వివాహానికి శర్వానంద్ అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కి టాలీవుడ్ ప్రముఖులు అందరు హాజరుకానున్నారని వినికిడి.
శర్వానంద్ ఆర్థికంగా ఉన్నతమైన ఫ్యామిలీ నుండి వచ్చారు. వీరి కుటుంబానికి జంట నగరాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. శర్వానంద్ ఈ ఏరియాకు వెళ్లినా అక్కడ తమ ప్రాపర్టీ ఒకటి చూపిస్తారట. శర్వానంద్ ఆస్తి వందల కోట్లలో ఉంటుందని సమాచారం. ఇక రక్షిత వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వీరికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వీరి తాత. శర్వానంద్ అత్యంత ఘనంగా పెళ్లి చేసుకుంటున్నారు
సపోర్టింగ్ రోల్స్ తో శర్వానంద్ కెరీర్ మొదలైంది. గమ్యం, ప్రస్థానం ఆయనకు ప్రేమ్ తెచ్చాయి. జర్నీ, రన్ రాజా రన్ హిట్స్ తో యూత్ లో ఫేమ్ తెచ్చుకున్నాడు. శతమానం భవతి, మహానుభావుడు చిత్రాలు శర్వానంద్ మార్కెట్ పెరిగేలా చేశాయి. ఇటీవల ఆయన కెరీర్ కొంచెం నెమ్మదించింది. శర్వానంద్ భారీ కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.
శర్వా పెళ్లి సందడి ❤️
Lovely & candid visuals from Hero @ImSharwanand ‘s Haldi Ceremony in Jaipur #Sharwanand #SharwAnand #Sharwa35 #Sharwa #haldifunction #marriage #ramcharan #prabhas #weddingvibes #Jaipur#SharwanandMarriage ❤️ pic.twitter.com/nV0Kpbyise
— SharwAnand ✨️ (@SharwaFans) June 2, 2023