Sharwanand Marriage: హీరో శర్వానంద్ ఓ ఇంటివాడవుతున్నాడు. ఆయనకు వివాహం కుదిరింది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. శర్వానంద్ ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరుపుకున్నారు. హైదరాబాద్ కి చెందిన రక్షిత రెడ్డితో ఆయనకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రక్షిత రెడ్డి హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. ఆ మధ్య శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ పుకార్ల మీద శర్వానంద్ స్పందించలేదు. తాజాగా పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నారట. జూన్ 3న శర్వానంద్-రక్షిత రెడ్డి వివాహం జరగనుందట.
అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ విశ్వసనీయ సమాచారం అందుతుంది. శర్వానంద్ బాగా ఆస్తిపరుడని సమాచారం. హైదరాబాద్ నగరంలో వీరి కుటుంబానికి అనేక ఆస్తులు ఉన్నాయట. శర్వానంద్ పేరెంట్స్ మంచి పొజీషన్స్ లో ఉన్నారట. ఇక శర్వానంద్ కెరీర్ కొంచెం నెమ్మదించింది. టైర్ టు హీరోగా నిలదొక్కుకున్న శర్వానంద్ వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నాడు. కెరీర్ బిగినింగ్ లో శర్వా సపోర్టింగ్ రోల్స్ చేశారు.
గమ్యం, ప్రస్థానం వంటి చిత్రాలు హీరోగా గుర్తింపు తెచ్చాయి. రన్ రాజా రన్ తో శర్వానంద్ ఫేమ్ అండ్ పాపులారిటీ తెచ్చుకున్నారు. శతమానం భవతి, మహానుభావుడు ఆయన మార్కెట్ పెరిగేలా చేశాయి. మహానుభావుడు చిత్రం తర్వాత శర్వానంద్ కి క్లీన్ హిట్ లేదు. ఒకే ఒక జీవితం పర్లేదు అనిపించుకుంది. దీంతో శర్వానంద్ కెరీర్ ప్రమాదంలో పడింది.
ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య గతంలో భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్, హీరో చిత్రాలు తెరకెక్కించారు. మంచి చిత్రాలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ వీటిలో ఒక్కటి కూడా కమర్షియల్ గా ఆడలేదు. మరి శర్వానంద్ కి ఎలాంటి ఫలితం ఇస్తాడో చూడాలి. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. త్వరలో కీలక అప్డేట్ చిత్ర యూనిట్ ఇవ్వనున్నారు. ఈ చిత్ర విజయం శర్వానంద్ కి చాలా అవసరం.