Sharwanand: మీడియం రేంజ్ హీరోలలో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ మార్కెట్ మొత్తాన్ని కోల్పోయిన హీరోల లిస్ట్ తీస్తే అందులో శర్వానంద్(Sharwanand) ముందు వరుసలో ఉంటాడు. ఈయన ‘శతమానం భవతి’ చిత్రం తర్వాత సరైన బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని 8 ఏళ్ళు కావొస్తుంది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన సినిమాల్లో రెండు యావరేజ్ రేంజ్ లో ఆడాయి, మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే ఈసారి కమర్షియల్ గా ఎలా అయినా భారీ హిట్స్ కొట్టాలనే ఉద్దేశ్యం తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ‘బైకర్’, ‘నారి నారి నడుమ మురారి’ చిత్రాలను చేసాడు. బైకర్ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ జానర్ లో మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు, సరిగ్గా తీసుంటే కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ ఈ చిత్రం కంటే ముందు ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం విడుదల కాబోతుంది. వాస్తవానికి ‘బైకర్ ‘ చిత్రం ఈ నెలలో విడుదల కావాలి. కానీ ఆ సినిమా విడుదల అప్డేట్ పై ఎలాంటి సమాచారం లేదు. కానీ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బిజినెస్ మొత్తం ఈ రెండు సినిమాలకే జరిగింది.శర్వానంద్ కి అటు మెగాస్టార్ చిరంజీవి తో, ఇటు ప్రభాస్ తో మంచి రిలేషన్ ఉంది. అయినప్పటికీ వాళ్ళిద్దరికీ ఎదురు వెళ్లాల్సి వస్తుంది. ఈ సినిమా వల్ల ‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు భారీ గా థియేటర్స్ కొరత పడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.