Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చాలా కిందిస్థాయి నుంచి వచ్చిన హీరో. అందుకే, డబ్బు దగ్గర రవితేజ నిక్కచ్చిగా ఉంటారు. ప్రస్తుతం డబ్బు కోసమే వరుస సినిమాలను అంగీకరిస్తూ పోతున్నాడు రవితేజ. ఎలాగూ వయసు కూడా పెరుగుతుంది, మహా అయితే మరో నాలుగేళ్లు మాత్రమే యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. అందుకే, ఈ నాలుగేళ్లలో సాధ్యమైనంత వరకు సినిమాలు చేసి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశాడు.

అలాగే ప్రస్తుతం ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా కొత్త దర్శకుడు విజయ్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో మరో సినిమా చేయడానికి రవితేజ రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమాకు నిర్మాత యువీ వంశీ.
Also Read: Chandini Chowdary: ఛాన్స్ ల కోసం చాందిని చౌదరి బరితెగింపు.. హాట్ స్టిల్స్ తో రచ్చ లేపుతుంది
అయితే ఈ సినిమా కోసం రవితేజ భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నాడట. తన పారితోషికంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదట. నిజానికి క్రాక్ కి ముందు వరకు రవితేజ 8 కోట్లు వరకు తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 16 కోట్లు వరకు అడుగుతున్నాడు. కారణం క్రాక్ సినిమా హిట్ అవ్వడం. మొత్తానికి ఒక్క హిట్ కే రెమ్యునరేషన్ ను డబుల్ చేయడం అనేది ఒక్క రవితేజకే చెల్లింది.
రవితేజ మొదటి నుంచి అంతే.. రూపాయి వచ్చే చోట రెండు రూపాయిలు అడుగుతాడు. రెమ్యునరేషన్ దగ్గర ఆయన అసలు మొహమాట పడరు. అయితే, మార్కెట్ పడిపోయిన సమయంలో కూడా తన పారితోషికంలో కాంప్రమైజ్ కాను అంటే కుదరదు కదా ?. శ్రీకాంత్ – రవితేజ సినిమా చేయడానికి నిర్మాత యువీ వంశీ అంగీకరించారు.

[…] […]
[…] […]
[…] […]