Ravi Teja Father Passes Away: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ (Raviteja)… కెరియర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్ లను చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు… కెరీర్ మొదట్లో చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా స్టార్ హీరో ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తూ సోలోగా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే రవితేజ కెరియర్ లో అత్యంత కీలక పాత్ర వహించిన అతని తండ్రి అయిన రాజగోపాల్ రాజు (90) గారు మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు…రవితేజ సినిమా ఇండస్ట్రీకి రావడానికి తను ఇక్కడ సక్సెస్ ఫుల్ గా కొనసాగడానికి,అలాగే రవితేజ ప్రతి విషయంలో ఆయన చాలా సహకారాన్ని అందించి అతని వెన్నంటే ఉన్నాడట. అందుకే రవితేజ సైతం ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా పేరెంట్స్ ను కోల్పోయినప్పుడు పిల్లలు పడే బాధ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం ఆయన్ని అతని సన్నిహితులు ఓదారుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ విషయాన్ని తెలుసుకొని రవితేజను పరామర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: కుబేర’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..ఈ ప్రాంతాల్లో భారీ నష్టాలు తప్పలేదు!
హైదరాబాదులోని రవితేజ నివాసంలోనే ఆయన తుది శ్వాసను విడిచినట్టుగా తెలుస్తోంది…ఇక మొదటి నుంచి కూడా రవితేజకు తన తండ్రి అంటే చాలా ఇష్టమట. వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండడం వల్లే ఏ విషయాన్ని అయినా సరే రవితేజ అతని ఫాదర్ తో షేర్ చేసుకుంటానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు నిశ్చలమైన స్థితిలో పడిపోయి ఉండడం చూసిన రవితేజ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా తెర మీద నటనను పండించినప్పటికి తెర వెనుక నటులకు కూడా కోలుకోలేని బాధలు భరించలేని ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అవి తారసపడుతూ ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
10 ఏళ్ల క్రితమే రవితేజ తమ్ముడు అయిన భరత్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం మనకు తెలిసిందే… ఇక ఆ సంఘటనని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న వాళ్లకి నాన్న మరణించడం అనేది వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి…