Allu Arjun అల్లు అర్జున్ కి సినీ ఇండస్ట్రీ లో ఎంతోమంది స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. ఆయనకి ఏ చిన్న కష్టమొచ్చినా ఇంటి ముందు వాలిపోతారు. అల్లు అర్జున్ కూడా అంతే, తన స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ఆ కారణం చేత ఆయన ఎన్నో తిట్లు, అవమానాలు కూడా పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ ఆయన తన తీరుని మార్చుకోడు, చేయాలనుకున్నది చేస్తాడు. అలా స్నేహితుల కోసం నిలబడే తత్త్వం ఉంది కాబట్టే, ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యి, బెయిల్ మీద బయటకి రాగానే ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటి ముందుకు వచ్చింది. నిన్న ఉదయం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కి సాయంత్రం బెయిల్ మంజూరు అయ్యింది. అయితే బెయిల్ పేపర్స్ పోలీసుల చేతుల్లోకి వచ్చేలోపు చాలా సమయం పట్టడంతో, అల్లు అర్జున్ ని నేడు ఉదయం తెల్లవారుజామున భారీ బందోబస్తుతో ఇంటికి పంపించారు.
ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ లో అత్యంత సన్నిహితులతో ఒకరు రానా దగ్గుబాటి. నేడు ఆయన జన్మదినం. పుట్టినరోజు సంబరాల్లో పాల్గొనాల్సిన రానా, తన స్నేహితుడు కోసం నిద్ర లేచిన వెంటనే హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో అల్లు అర్జున్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే రానా అతని వద్దకు వస్తాడు. అతను ఫోన్లో మాట్లాడుతుండడాన్ని చూసి పక్కకి వెళ్తున్న రానా ని చెయ్యి పట్టుకొని ఆపుతాడు అల్లు అర్జున్. వెంటనే ఫోన్ పెట్టేసి, రానా ని ఎమోషనల్ గా హత్తుకుంటాడు. ఈ వీడియో ని చూసి అభిమానులు బాగా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి అద్భుతమైన బాండింగ్ కి గౌరవం ఇస్తూ ట్వీట్లు వేస్తున్నారు. అదే సందర్భంలో అల్లు అర్జున్ అభిమానులు రానా కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నారు.
మరోపక్క అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తనకు సపోర్టుగా నిల్చిన ప్రతీ ఒక్కరికి, మీడియా రిపోర్టర్స్ కి ధన్యవాదాలు తెలిపాడు. అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా బెయిల్ మీద విడుదల అయ్యారు. అల్లు అర్జున్ మ్యానేజర్ కి మాత్రం ఇంకా బెయిల్ రాలేదు. సోమవారం వరకు ఆగాల్సిందే. సోషల్ మీడియా లో ఆయన విడుదలై ఇంటికి వెళ్ళిపోయినందుకు అభిమానులతో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుండి అందరూ చాలా టెన్షన్ పడిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించి చట్టం ముందు ఎవరైనా ఒక్కటే, అల్లు అర్జున్ పోలీసుల ప్రోటోకాల్స్ పాటించకపోవడం వల్ల ఒక మహిళ ప్రాణం పోయింది, అందుకే ఆయనపై కేసు నమోదు అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. సీఎం కామెంట్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
రానా దగ్గుబాటిని గట్టిగా హాగ్ చేసుకోని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్@alluarjun #RanaDaggubati #AlluArjun #AlluArjunArrest #AlluArjunBail pic.twitter.com/yJ3ZJhUaw3
— TeluguOne (@Theteluguone) December 14, 2024