Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో నేడు జరగబోయేది చివరి ఎపిసోడ్ గా చెప్పుకోవచ్చు. రేపు గ్రాండ్ ఫినాలే ఘనంగా జరగబోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిన ఈ సీజన్, కేవలం యావరేజ్ రేంజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కంటెస్టెంట్స్ అందరూ మంచి ఫైర్ మీద ఆడవాళ్లే, కానీ బిగ్ బాస్ వాళ్ళను సరిగా ఉపయోగించుకోలేదు అని అనిపించింది. ముఖ్యంగా ఈ సీజన్ ని క్లాన్ కాన్సెప్ట్ ముంచేసింది అనే చెప్పొచ్చు. ఇంతకు ముందు సీజన్స్ లో గ్రూప్ గేమ్స్ అంటే పెద్ద నేరం అన్నట్టుగా జనాలు చూసేవారు. ఏదైతే జనాలు తప్పుగా భావించారో, ఆ కాన్సెప్ట్ తో ఈ సీజన్ ని ప్రారంభంలో నడపడం పెద్ద మైనస్ అయ్యింది. టీఆర్ఫీ రేటింగ్స్ ఒక్కసారిగా దీని దెబ్బకు ఢమాల్ అనడంతో క్లాన్స్ ని రద్దు చేసి, కేవలం మెగా క్లాన్ గా చేసాడు బిగ్ బాస్. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది.
వైల్డ్ కార్డ్స్ ఈ సీజన్ ని అట్టర్ డిజాస్టర్ అవ్వకుండా, తమవంతు ఎంత కష్టపడాలో, అంత కష్టపడ్డారు. కొంతమేరకు అందులో సక్సెస్ కూడా అయ్యారు. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే మూడవ ప్రోమోని మీరంతా చూసే ఉండుంటారు. ఈ ప్రోమో లో టాప్ 5 కంటెస్టెంట్స్ కట్టెల పొయ్యి చుట్టూ కూర్చుంటారు. బిగ్ బాస్ మీ జీవితంలో జరిగిన ఒక సంతోషకరమైన విషయం, అలాగే విచారకరమైన విషయాన్నీ చెప్పుమనగా, కంటెస్టెంట్స్ అందరూ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉంటారు. ముందుగా నబీల్ మాట్లాడుతూ ‘నా జీవితం లో జరిగిన ది బెస్ట్ మూమెంట్ బిగ్ బాస్ సీజన్ 8 కి రావడం’ అని అంటాడు. ఆ తర్వాత నిఖిల్ మాట్లాడుతూ ‘రెండు మూడు సంవత్సరాలు ఏ పని లేకుండా ఇంట్లోనే ఉండేవాడని. అప్పుడప్పుడు అమ్మానాన్నలను 20, 30 రూపాయిలు అడిగి తీసుకునేవాడిని. అమ్మ నన్ను తిట్టేది, నువ్వు మాకు భారంగా తయారు అవుతున్నావు, నిన్ను సాకడమే కాకుండా నీకు డబ్బులు కూడా ఇవ్వాలా? అని అనింది. అప్పుడే నాకు ఒక సీరియల్ లో ఆఫర్ వచ్చింది. రోజుకి 2500 రూపాయిలు ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు’ అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో ఆమె నాన్న చనిపోయిన వార్త అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. తన నాన్నమ్మ కోసం ప్రేరణ బయటకి వెళ్లిపోయిన వెళ్లిపోవచ్చు అంటూ కామెంట్స్ వినిపించాయి. ఇన్ని రోజులు తర్వాత తన నాన్నమ్మ గురించి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది ప్రేరణ. ఇక గౌతమ్ తన గురించి చెప్తూ ‘నేను మెడిసిన్ చదువుతున్న రోజుల్లో నాకు ఒక లవ్ ఫెయిల్యూర్ వచ్చిందని మీ అందరికి చెప్పాను కదా. ఆ సమయంలో నేను ఢిల్లీ లో ఉండేవాడిని. ఒక బిల్డింగ్ మీద నుండి 18 అంతస్తుల నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను, ఆ రేంజ్ డిప్రెషన్ లోకి వెళ్ళాను’ అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్.