Photo Story: తెలుగు సినిమా పరిశ్రమలో వారసులకు కొదువ లేదు. ఇప్పుడున్న చాలా మందిలో ఎంతో కొంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే. అయితే తండ్రులు స్టార్లుగా మారినా వారసులు మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. నేటి పరిస్థితుల్లో ఎంత మంచి సినిమాల్లో నటించినా ఒకటి, రెండు సినిమాల తరువాత వారిని మరిచిపోతున్నారు. అయినా కొందరు హిట్టు, ఫట్టు తో సంబంధం లేకుండా సినిమాల్లో కొనసాగుతున్నారు. ఓ స్టార్ హీరో కూతురు పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటి వరకు కొన్ని సినిమాల్లో నటించినా ఆమెకు గుర్తింపు లేదు. కానీ నటనలో మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. ఇటీవల ఓ మూవీలో అలరించిన ఆ భామకు సంబంధించిన ఓ చైల్డ్ హుడ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆమె ఎవరో చూద్దామా.
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరో డాక్టర్ రాజశేఖర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంకుశం, ఆవేశం సినిమాలతో రాజశేఖర్ అప్పట్లోనే ఫేమస్ అయ్యారు. ఇదే సమయంలో ఆయనతో హీరోయిన్ గా నటించిన జీవితతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్ మొన్నటి వరకు సినిమాల్లో కనిపించారు. రాజశేఖర్-జీవతల వారసురాలిగా ఆమె కుమార్తె శివాత్మిక సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ‘దొరసాని’ అనే మూవీ ద్వారా పరిచయం అయిన ఈ భామకు ఇప్పటి వరకు గుర్తింపు ఉన్న సినిమా దక్కలేదు.
కరోనా సమయంలో ఆమె నటించిన ‘అద్భుతం’ కాస్త పేరు రావడంతో శివాత్మిక కు ఫ్యాన్స్ పెరిగారు. అయితే సినిమాలతో సంబంధం లేకుండా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. దీంతో హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా శివాత్మక పలు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేస్తుంది. లేటేస్గుగా ఆమె ‘రంగమార్తండ’ మూవీలో అలరించింది.ఈ మూవీలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.
ఈ సందర్భంగా ఆమె ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ కారులో ప్రయాణిస్తూ.. స్నేహితులతో ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ వీడియోనూ చూసి చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శివాత్మిక త్వరలోనే ఓ రేంజ్ హీరోయిన్ గా సక్సెస్ అందుకుంటుందని అంటున్నారు. ఇక ఆమెకు సంబంధించిన ఓ చైల్డ్ హుడ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శివాత్మిక ముద్దు ముద్దుగా అలరిస్తోంది.