కరోనా వైరస్ ప్రభావం తో అతలా కుతలం అవుతున్న వివిధ రంగాలలో సినీ రంగం కూడా ఒకటి .ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల వేలాది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. షూటింగ్ ఉంటేనే గాని రోజు గడవని స్థితి వాళ్ళది. అటువంటి నిరుపేద సినీ కళాకారుల్ని ఆదుకొనేందుకు హీరో రాజశేఖర్ ముందుకొచ్చాడు .
గత కొద్దిరోజులుగా సినిమా షూటింగులు బంద్ అవ్వడం వలన చిన్నా చితకా పాత్రలతో కడుపు నింపుకొని బతికే కళాకారుల పరిస్థితి చాలా దయనీయం గా మారింది. షూటింగ్ ఉన్న సమయం లో వారికి రెండు పూటలు కాకపోయినా ఒక పూట అయినా తిండి దొరికేది . దానికి తోడు ఏ రోజు వేతనం ఆ రోజు వాళ్ల చేతికి అందేది. దాంతో వల్ల పెళ్ళాం బిడ్డలు కడుపు నింపుకొనే వారు.ఇపుడు జూనియర్ ఆర్టిస్టులకు ఆ వెసులు బాటు లేదు కాలే కడుపుతో రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వల్ల ఎవరూ బయటికి రాకూడదు అన్న నిబంధన వారి పాలిట శాపంగా మారింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హీరో రాజశేఖర్ తన వంతు సాయం చేయడానికి సిద్ద మయ్యాడు.
తాను స్థాపించిన రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కళాకారులకు పది రోజుల పాటు నిత్యావసరాలను అందించేందుకు సమాయత్త మౌతున్నాడు. ఇందుకు గాను ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ , పస్తులు ఉంటున్న కళాకారులు 9010810140 అనే ఫోన్ నెంబర్ కి కాల్ చేసి నవీన్ వర్మ అనే వ్యక్తి కి తమ వివరాలు అందిస్తే వారికి కావాల్సిన సహాయం అందుతుంది అని రాజశేఖర్ తెలియజేయడం జరిగింది.
తెలుగు సినీ పరిశ్రమ లోని నిరుపేద కళా కారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని oktelugu.com కోరుకొంటోంది.
May god bless his humanity