Nithin: టాలీవుడ్ యువ హీరోలలో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకడు నితిన్..మధ్యలో డజనుకు పైగా సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో మార్కెట్ పూర్తిగా కోల్పోయిన నితిన్ ఇష్క్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి, మంచుకి యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు..అయితే నితిన్ రెండేళ్ల క్రితం తన ప్రియురాలు షాలిని ని పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..అంగరంగ వైభవంగా వీళ్లిద్దరి పెళ్లి అతిరథ మహారథుల సమక్షం లో జరిగింది.

అయితే చాలా కాలం నుండి నితిన్ అభిమానులు తమ అభిమాన హీరో ఎప్పుడు తండ్రి అవ్వబోతున్నాడో అనే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు..ఇప్పుడు నితిన్ ఫాన్స్ కి ఆ వార్త రానే వచ్చింది..షాలిని కొద్దీ కాలం క్రితమే తల్లి అయ్యింది..ఆమె గర్భం తో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యాయి.
అయితే నితిన్ మాత్రం ఇప్పటి వరుకు ఈ వార్త ని అధికారికంగా ప్రకటించలేదు..బిడ్డ బయటకి వచ్చినప్పుడే ఆయన అభిమానులతో ఈ విషయం పంచుకోనున్నాడు అట..ఇక దీనితో పాటు నితిన్ చాలా కాలం నుండి తన డ్రీం హౌస్ ని చేదక్కించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు..కానీ కొన్ని ఇబ్బంది కరమైన సంఘటనలు చోటు చేసుకోవడం తో చాలా కాలం నుండి ఆ ఇల్లు ఆయనకీ దక్కకుండా ఉన్నది..ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొగలిపోయి ఆ ఇల్లు అతని సొంతం అయ్యిందట..అది కూడా దీపావళి రోజున జరగడం శుభ సూచికం.

ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఈయన హీరోగా నటించిన ‘మాచెర్ల నియోజకవర్గం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది..ఈ సినిమా తర్వాత నితిన్ వక్కంతం వంశీతో ఒక సినిమా చేస్తున్నాడు..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి..ఎలా అయినా నితిన్ భారీ హిట్ కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.