Hero Navadeep: సినిమా రంగంలో అవకాశాలు అనేవి సడెన్ గా వస్తుంటాయి. అయితే హీరోలు అయినా లేదంటే హీరోయిన్లు అయినా తమకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు.

కానీ అది రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయిందంటే మాత్రం ఆ బాధ చెప్పలేనంత ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలే హీరోల కెరీర్ ను నిలబెడుతాయి. అలాంటి హిట్ ఒక్కటి పడినా చాలా అనుకుంటారు హీరో, హీరోయిన్లు.

అయితే ఇప్పుడు ఓ యంగ్ హీరో గురించి చెప్పుకోవాలి. అతను 2006 రిలీజ్ అయిన బొమ్మరిల్లు మూవీని వదులుకున్నాడంట. ఈ మూవీలో సిద్ధార్థ్ నటించగా.. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మనందరం చూశాం. నిజం చెప్పాలంటే.. ఆ మూవీ తర్వాత సిద్ధార్థ్ ఇమేజ్ అమాంతం మారిపోయింది. ఇప్పటికీ ఆ మూవీ చాలా ఫేమస్. భాస్కర్ డైరెక్షన్ చేయగా.. ఇందులో హాసిని పాత్రలో జెనీలియా నటించింది.
Also Read: భీమ్లా నాయక్’ పాటల జ్యూక్ బాక్స్ రిలీజ్
ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో రూ.6 కోట్లు పెట్టి తీసిన ఈ మూవీ దిల్ రాజుకు ఏకంగా రూ.50 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి లాభాలు తెచ్చిపెట్టింది. కాగా ఈ మూవీని మొదట హీరో నవదీప్ కు చెప్పారంట. అప్పట్లో నవదీప్ ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. కానీ దిల్ రాజు మాత్రం అతన్ని హీరోగా పరిచయం చేస్తూ ఈ మూవీ తీయాలని అనుకున్నాడంట.

కానీ అతను అప్పటికే జై మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టాడు. ఆ స్పీడుతోనే గౌతమ్ ఎస్.ఎస్.సి, మొదటి సినిమా, ప్రేమంటే ఇంతే లాంటి సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఈ కారణంగా అతను బొమ్మరిల్లు సినిమాను వదులుకున్నాడు. దీంతో దిల్ రాజు ఆ మూవీని సిద్ధార్థ్ తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక నవదీప్ చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో ఈ మూవీని వదులుకున్నందుకు అతను చాలా బాధ పడ్డాడంట. ఆ మూవీ చేసి ఉంటే.. ఇప్పటికీ హీరోగా కొనసాగేవాడేమో అంటున్నారు సినీ విశ్లేషకులు. తరతరాలు గుర్తుండిపోయే సినిమాను వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా మరి.
Also Read:అఖండ కృతజ్ఞత సభ.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే