Hero Nani- Liger: హీరో నాని సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నానిని మించి ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. తన నటన, యాటిట్యూడ్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. విజయ్ నటించిన ‘లైగర్’ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. దీనిపై సీనీ ప్రముఖులు, ప్రేక్షకులు తమదైన శైలిలో చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా హీరో నాని సైతం టాలీవుడ్ లో వరుస హిట్స్ పై ట్వీట్ చేశాడు. ఈ ఆగస్టు చిత్ర పరిశ్రమను బతికించిందని ట్వీట్ చేశాడు. ఈ ఆగస్టు నెల ఎంతో ప్రత్యేకం. తెలుగు సినిమా పరిశ్రమకు, ప్రేక్షకులకు మరుపురాని విజయాలను అందించింది. ‘బింబిసార’, సీతారామం, కార్తికేయ2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ చిత్రం యూనిట్ లకు పెద్ద శుభాకాంక్షలు అంటూ నాని ట్వీట్ చేశాడు.
ఇక అలాగే ఈరోజు విడుదలవుతున్న ‘లైగర్ ’ మూవీ టీంకు కూడా నాని తన ట్విట్టర్ లో ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తన బెస్ట్ విషెస్ ను విజయదేవరకొండ.. పూరి జగన్నాథ్ కు తెలియజేశాడు. ఈ నెలాఖరులో వస్తున్న బిగ్ బ్యాంగ్ లైగర్ అంటూ కొనియాడారు.

నాని చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ద్వారానే నటుడిగా విజయ్ కాస్త ఫోకస్ అయ్యారు. అందుకే నానికి, విజయ్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆస్నేహంతోనే నాని ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.