Nani: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కెరీర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా, రేడియో జాకీ గా పనిచేశారు ఈ స్టార్ హీరో. ఆ తర్వాత హీరోగా అవకాశాలు రావడం తో నటించడం మొదలు పెట్టారు. ముందుగా బాపు, శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన నాని అష్టా చెమ్మా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించారు. మొదటి సినిమానే హిట్ ను సొంతం చేసుకోవడంతో నానికి మంచి మార్కులు పడ్డాయి. అలా మొదలైన నాని ప్రయాణం ఎన్నో హిట్లు, కొన్ని ఫ్లాప్ లను సొంతం చేసుకుంటూ వచ్చారు.
ఈగ, జెర్సీ, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, నేను లోకల్ వంటి సినిమాలు నానికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక రీసెంట్ గా వచ్చిన దసరా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. పాన్ ఇండియా రేంజ్ లో నానికి మంచి గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా నాని హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ నాని సరసన జతకట్టింది. ఈ సినిమా మాత్రమే కాదు సరిపోదా శనివారం అనే టైటిల్ తో మరో సినిమా తో రానున్నారు నాని. ఇప్పుడు నాని గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆయన ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్న ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
నాని 11 సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నారు. 2012లో అక్టోబర్ 27న స్నేహితురాలు అంజనా ఎలవర్తి ని పెళ్లి చేసుకున్నారు నాని. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే ఈ జంటకు పెళ్లై 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భార్యతో ఉన్న బ్యూటీఫుల్ ఫోటోలను పంచుకున్నారు ఈ హీరో. ఇందులో భార్యకు బొట్టు పెడుతున్నారు నాని. అంతే కాదు ఫోటోకు క్యాప్షన్ ఇస్తూ.. మా బంధానికి 11 సంవత్సరాలు అని తెలిపారు. అయితే వీరు 5సంవత్సరాలు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్నారని టాక్. మొత్తం మీద 11 సంవత్సరాల వీరి బంధానికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram