https://oktelugu.com/

Shyam Singha Roy: నాని ఆశలన్నీ శ్యామ్​ సింగరాయ్​ పైనే.. హిట్​ కొడతాడా!

Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రానున్న సినిమా శ్యామ్ సింగరాయ్​. టాక్సీవాలా సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రాహుల్​ సాంకృత్యన్​ ఈ చిత్రానికి డైరెక్ట్​ చేస్తున్నారు. పిరియాడికల్​ నేపథ్యంలో రానున్న ఈ సినిమా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో నాని డ్యుయల్​ రోల్​లో కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్​ నటిస్తున్నారు. సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్​, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇటీవల దీపావళి కానుకగా హీరోయిన్స్​కు సంబంధించిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 5, 2021 / 11:47 AM IST
    Follow us on

    Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రానున్న సినిమా శ్యామ్ సింగరాయ్​. టాక్సీవాలా సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రాహుల్​ సాంకృత్యన్​ ఈ చిత్రానికి డైరెక్ట్​ చేస్తున్నారు. పిరియాడికల్​ నేపథ్యంలో రానున్న ఈ సినిమా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో నాని డ్యుయల్​ రోల్​లో కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్​ నటిస్తున్నారు. సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్​, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు.

    ఇటీవల దీపావళి కానుకగా హీరోయిన్స్​కు సంబంధించిన లుక్​ పోస్టర్​ను విడుదల చేశారు. ముగ్గురు విభిన్నమైన గెటప్స్​లో కనువిందు చేశారు. కలకత్తా బ్యాక్​ డ్రాప్​లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయిపల్లవి రోల్​ కీలకంగా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్. అంతే కాకుండా, సాయిపల్లవి పాత్రకు అతీత శక్తులు ఉంటాయని టాక్​ నడుస్తోంది.

    కాగా, ఇటీవలే నాని నటించిన వి, టక్​ జగదీష్​ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. పైగా ఈ రెండు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. అయితే, శ్యామ్​సింగ్​రాయ్​ మాత్రం థియేటర్లలో రిలీజ్​ కానుంది. దీంతో, నాని ఎలాగైనా ఈ సినిమాలో హిట్​ కొట్టాలని అనుకుంటున్నారు. డిసెంబరు 24న ఈ సినిమా గ్రాండ్​ రిలీజ్​ కానుంది. దీంతో వరుసగా సినిమాకు సంబంధించిన అప్​డేట్స్​ ఇస్తోంది చిత్రబృందం. మరి ఆశించిన స్థాయిలో విజయం అందుకుంటుందేమో వేచి చూడాలి.