https://oktelugu.com/

Lathasri: డబ్బు కోసం మా అమ్మను చంపేశారు… హీరో నాగ శౌర్య మేనత్త లతాశ్రీ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకి ఈమె మేనత్త. నాగశౌర్య తండ్రి లతాశ్రీకి అన్న అవుతాడు. నాగశౌర్య సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కి కారణమైన లతాశ్రీ, అన్న కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో లతాశ్రీ పాల్గొన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 12, 2024 / 06:26 PM IST

    Lathasri

    Follow us on

    Lathasri: సీనియర్ నటి లతాశ్రీ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి పంచుకున్నారు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన లతాశ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. ముద్దుల మేనల్లుడు, అల్లరోడు, ఆ ఒక్కటి అడక్కు, యమలీల వంటి హిట్ చిత్రాల్లో లతాశ్రీ కీలక రోల్స్ చేసింది. తన అందం, అభినయంతో ఏళ్ల పాటు ప్రేక్షకులని మెప్పించిన లతాశ్రీ నటనకు దూరమయ్యారు. ఆమె గృహిణిగా ఇంటికే పరిమితమయ్యారు.

    టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకి ఈమె మేనత్త. నాగశౌర్య తండ్రి లతాశ్రీకి అన్న అవుతాడు. నాగశౌర్య సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కి కారణమైన లతాశ్రీ, అన్న కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో లతాశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…నాకు ఎక్కువగా కన్నడ పరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ నా తల్లి తెలుగులోనే సినిమాలు చేయమని చెప్పడంతో .. ఇక్కడే చేస్తూ వచ్చానని, అన్నారు.

    ఇక మలయాళంలో అవకాశాలు వచ్చినా వెళ్ళలేదు అని తెలిపారు. అక్కడ ఓ డైరెక్టర్ అందరి ముందు నాకు నటన రాదని ఎగతాళి చేశాడు. అప్పటి నుంచి మలయాళం గుమ్మం తొక్కలేదన్నారు లతాశ్రీ. ఇక తన తల్లి మరణం గురించి మాట్లాడుతూ .. అమ్మకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చేర్చాము. బాగానే ఉంది. మాట్లాడుతుంది. డిశ్చార్జ్ చేస్తారు అనుకుంటే, కావాలని 18 రోజులు ఐసియూలో పెట్టారు .. డబ్బు కోసం చేస్తున్నారు అని మాకు తెలిసి తీసుకెళ్లి పోదాం అనుకున్నాం. ఆ విషయం వారికి తెలిసింది. ఆ మరుసటి రోజు అమ్మ చనిపోయిందని చెప్పారని… ఎమోషనల్ అయ్యారు లతాశ్రీ.

    తనని తెలుగు దర్శకులు బాగా ప్రోత్సహించారని లతాశ్రీ అన్నారు. కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా చేసే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తాను అన్నారు లతాశ్రీ. ఈ సందర్భంగా ఆమె తన లవ్ స్టోరీ గురించి కూడా పంచుకున్నారు. ఓ జిమ్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డానన్నారు. ఆ జిమ్ ట్రైనర్ తండ్రి డిప్యూటీ కలెక్టర్. ఆయనతో పాటు తన తల్లి కూడా పెళ్ళికి ఒప్పుకోలేదట. అయినా సరే అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అంటూ లతాశ్రీ చెప్పుకొచ్చారు.