
Hero Manchu Manoj’s wedding : మంచు మనోజ్ రెండో వివాహం పై గత ఆరు నెలలుగా వరుస కథనాలు వెలువడుతున్నాయి. కర్నూలుకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ భూమా మౌనికతో ఆయన చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గత ఏడాది వినాయక చవితి సందర్భంగా మనోజ్-మౌనిక గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎంత మిత్రులైనా కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేయరు కాబట్టి, మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం మొదలైంది. ఈ అనుమానాలు బలపరిచే విధంగా మనోజ్ ఆ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటారు.
భూమా మౌనికకు కూడా భర్తతో విడాకులు అయ్యాయి. డైవర్స్ అయ్యాక ఒంటరిగా ఉంటున్న వీరిద్దరూ ఒక్కటయ్యారని టాక్. అసలు సహజీవనం చేస్తున్నారని కూడా ఓ వాదన ఉంది. దీంతో తమ బంధం అధికారికం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. పెళ్ళికి ముహూర్తం సెట్ చేసుకున్నారట. మార్చి 3న మనోజ్-మౌనికల వివాహం జరగనుందట. మనోజ్ సిస్టర్ మంచు లక్ష్మి ఇంట్లో వివాహంలో భాగంగా ఒక వేడుక జరపనున్నారట. ఇక పెళ్లి ఎక్కడ జరుగుతుంది? ఎందరికి ఆహ్వానం ఉంటుంది? ప్రెవేట్ గా చేసుకుంటారా లేక పబ్లిక్ ఇన్విటేషన్ ఉంటుందా? అనే సందేహాలు వెంటాడుతున్నాయి.
మనోజ్ అయితే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో మరో వాదన వినిపిస్తోంది. మోహన్ బాబుకు ఇష్టం లేకుండా ఈ వివాహం జరుగుతుందట. ఆయన వద్దన్నా ఎదిరించి మౌనికను మనోజ్ పెళ్ళాడుతున్నాడట. కాబట్టి మనోజ్ రెండో వివాహం నిరాడంబరంగా ముగియనుంది అంటున్నారు. మోహన్ బాబు, విష్ణు ఈ పెళ్ళికి హాజరు కాకపోవచ్చంటున్నారు.
2015లో మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి 2019లో విడాకులు అయ్యాయి. అప్పటి నుండి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. మరోవైపు కెరీర్ పూర్తిగా నెమ్మదించింది. మనోజ్ మూవీ చేసి నాలుగైదేళ్లు అవుతుంది. చాలా కాలం క్రితం అహం బ్రహ్మస్మి టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. అది ఆగిపోయినట్లు సమాచారం. ఇటీవల ‘వాట్ ది ఫిష్’ టైటిల్ తో ఒక చిత్రం ప్రకటించారు.