https://oktelugu.com/

Hero Madhavan Son: అంతర్జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించిన హీరో మాధవన్ కొడుకు

Hero Madhavan Son: తెలుగు తమిళ బాషలలో విభిన్నమైన పాత్రలు చేసారు ఎన్నో క్లాసికల్ హిట్ చిత్రాల్లో నటించిన హీరో మాధవన్..ఒక్కప్పుడు ఈయనకి సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఈయనకి ఉన్న లేడీస్ ఫాలోయింగ్ అప్పట్లో ఎవ్వరికి లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..సినిమా రంగం లోకి రాకముందు యాడ్స్ లో నటించిన మాధవన్, ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించి 1997 వ సంవత్సరం లో ఏకంగా తోలి సినిమాతోనే హాలీవుడ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 18, 2022 / 11:54 AM IST
    Follow us on

    Hero Madhavan Son: తెలుగు తమిళ బాషలలో విభిన్నమైన పాత్రలు చేసారు ఎన్నో క్లాసికల్ హిట్ చిత్రాల్లో నటించిన హీరో మాధవన్..ఒక్కప్పుడు ఈయనకి సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఈయనకి ఉన్న లేడీస్ ఫాలోయింగ్ అప్పట్లో ఎవ్వరికి లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..సినిమా రంగం లోకి రాకముందు యాడ్స్ లో నటించిన మాధవన్, ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించి 1997 వ సంవత్సరం లో ఏకంగా తోలి సినిమాతోనే హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది..ఇంఫెర్నో అనే ఇంగ్లీష్ సినిమా ద్వారా ప్రారంభం అయినా సినీ ప్రస్థానం నేడు దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు దక్కించుకున్న హీరోలలో ఒక్కరిగా మారిపోయాడు..ఆయన నటించిన చెలి , సఖి మరియు రన్ వంటి సినిమాలో తెలుగు లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇది ఇలా ఉండగా మాధవన్ కి సంబంధించిన ఒక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    ఇక అసలు విషయానికి వస్తే మాధవన్ కొడుకు వేదాంత్ కి మొదటి నుండి స్పోర్ట్స్ అంటే ఎంతో ఆసక్తి..తన ఆసక్తిని గమనించిన మాధవన్ తన కొడుకుని స్పోర్ట్స్ లో రాణించేందుకు అన్ని విధాలుగా సపోర్టు గా నిలిచి ప్రోత్సహించాడు..నేడు ఆయన ఇచ్చిన సపోర్ట్ తన కొడుకుని దేశం గర్వించదగ్గ పని చేసే విధంగా చేసింది..డెన్ మార్కు లో ఇటీవల డానిష్ స్విమ్మింగ్ పోటీలను ఘనంగా నిర్వహించారు..ఈ పోటీలలో అన్ని దేశాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు..వారిలో మాధవన్ గారి కొడుకు వేదాంత్ కూడా ఒక్కడు..ఈ స్విమ్మింగ్ పోటీలో ఆయన అద్భుతంగా రాణించి మన దేశానికీ సిల్వర్ మెడల్ ని తీసుకొచ్చి సరికొత్త చరిత్ర సృష్టించాడు..దీనితో వేదాంత్ కి సోషల్ మీడియా అంతటా ప్రశంసల వర్షం కురుస్తుంది..ఇక తండ్రిగా మాధవన్ గారికి ఎంత గర్వంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తాను సినిమా హీరో కాబట్టి తన కొడుకు కూడా సినిమా హీరో అవ్వాలి అనే మైండ్ సెట్ తో కాకుండా తనకి ఏది ఇష్టమో అందులో రాణించేందుకు నూటికి నూరు పాళ్ళు తన వంతు సపోర్ట్ ఇచ్చి దేశం లో ఉన్న ఎంతో మంది తల్లి తండ్రులకు ఆదర్శంగా నిలిచారు మాధవన్.

    Hero Madhavan Son

    Also Read: రోజాపై అలాంటి పంచ్ లు వేసిన రాకెట్ రాఘవ.. ఎత్తుకు ఎదిగిపోయారంటూ?

    ఇక మాధవన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన రాకెట్రీ అనే పాన్ ఇండియా సినిమాని చేస్తున్నాడు..ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, మరియు తమిళ స్టార్ హీరో సూర్య ఒక్క ముఖ్య పాత్రలను చేస్తుండగా, సిమ్రాన్ హీరోయిన్ గా నటిస్తుంది..విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మరియు అభిమానులను ఆకట్టుకునే మాధవన్ ఈ సినిమా ద్వారా రాకెట్ సైన్స్ ఫిక్షన్ జానర్ తో సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు..షూటింగ్ కార్యక్రమాలు అన్ని దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే థియేటర్స్ లో విడుదల కాబోతుంది..ఒక్క పక్క వరుసగా సినిమాలు చేస్తూనే మరో పక్క చేతినిండా వెబ్ సిరీస్ లతో అభిమానులను అలరిస్తున్నాడు మాధవన్..ఇక తెలుగు లో ఆయన ఆఖరుగా వెండితెర మీద కనిపించిన చిత్రం సవ్యసాచి..ఈ సినిమా తర్వాత ఆయన నిశబ్దం అనే సినిమా కూడా చేసాడు..ఇది OTT లో నేరుగా విడుదల అయ్యింది..ఇక ఆయన హిందీ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన నటుడు అనే సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం హిందీ లో ఆయన రెండు డైరెక్ట్ సినిమాలు చేసాడు..షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ చిత్రాలు అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

    Also Read: ‘పసివాడి ప్రాణం’ సినిమాలో చిరంజీవి పక్కన నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

    Tags