kartikeya: హీరో కార్తికేయ ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఒప్పించి.. ఇద్దరూ కలిసి మూడుముళ్లబంధంతో ఒకటై వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కాగా, ఆదివారం హైదరాబాద్లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

కాగా, తాజాగా, వీరి వెడ్డింగ్ రిసెఫ్షన్ చాలా గ్రాండ్గా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ రిసెఫ్షన్కు తెలుగు సినీ ప్రముఖులతో పాటు, బాలీవుడ్, కోలీవు్ సినీ తారలు కూడా హజరయ్యారు. కళ్లు చెదిరే అరేంజ్మెంట్స్తో వీరి రిసెప్షన్ అదిరిపోయింది.
Also Read: భారీ లెవెల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేసిన “శ్యామ్ సింగరాయ్” టీమ్…
వరంగల్ నీట్లో ఇద్దరు బీటెక్ చదువుతున్న రోజుల్లో ఒకరినొకరు పరిచయమయ్యారు. అది కాస్త ప్రేమగా మారింది. 2012లో లోహితకు లవ్ ప్రపోజ్ చేసి.. ఇంట్లో మాట్లాడి ఒప్పించుకున్నాడు కార్తికేయ. అలా హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో.. లోహిత్ ప్రేమను దక్కించుకోడానికి అంతే కష్టపడ్డాడట. అలా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు ప్రేమను కూడా దక్కించుకున్నాడు.
కాగా, ఇటీవలే రాజా విక్రమార్క సినిమాతో ప్రేక్షకులను అలరించిన కార్తికేయ.. ఈ సినిమాతో మంచి టాక్ అందుకున్నాడు. మొదట్లో కాస్త మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. మెల్లగా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతంం అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమై సినిమాలో విలన్గా నటిస్తున్నాడు. కాగా, ఆర్ఎక్స్ 100 తర్వాత మొన్న వచ్చిన చావుకబురు చల్లగా వరకు అన్ని సినిమాలూ భిన్నమైన కథలే. దీన్ని బట్టి తెలుస్తోంది. కార్తికేయ కథలు ఎంచుకోవడంలో ఎంత జాగ్రత్త వహిస్తారో.
Also Read: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్కు చిరు విజ్ఞప్తి