https://oktelugu.com/

Hero Karthi On Pushpa: ‘పుష్ప’ కి మరో స్టార్ హీరో ఫిదా.. ఎందుకు అందరూ పుష్ప పై పడ్డారు ?

Hero Karthi On Pushpa: ‘పుష్ప’ సినిమాను ‘అమెజాన్ ప్రైమ్’లో చూసి సినీ ప్రముఖులు పుష్పరాజ్ పై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు. తాజాగా హీరో కార్తీ పుష్ప పై వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “పుష్పరాజ్ అనే పాత్రలో అల్లు అర్జున్ పూర్తిగా ప్రవేశించి నటించాడు అని, బన్నీ పెర్ఫామెన్స్ అదిరిపోయింది అని.. ఇక సుకుమార్ సర్ ప్రతి మూమెంట్ ను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు అని, అలాగే నటీనటులను కూడా ఆయన చాలలా […]

Written By:
  • Shiva
  • , Updated On : January 11, 2022 / 11:39 AM IST
    Follow us on

    Hero Karthi On Pushpa: ‘పుష్ప’ సినిమాను ‘అమెజాన్ ప్రైమ్’లో చూసి సినీ ప్రముఖులు పుష్పరాజ్ పై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు. తాజాగా హీరో కార్తీ పుష్ప పై వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “పుష్పరాజ్ అనే పాత్రలో అల్లు అర్జున్ పూర్తిగా ప్రవేశించి నటించాడు అని, బన్నీ పెర్ఫామెన్స్ అదిరిపోయింది అని.. ఇక సుకుమార్ సర్ ప్రతి మూమెంట్ ను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు అని, అలాగే నటీనటులను కూడా ఆయన చాలలా టాప్ లో చూపిస్తారని.. చివరగా కాస్ట్ అండ్ క్రూది ఫెంటాస్టిక్ జాబ్ అంటూ పోస్ట్ చేశాడు కార్తీ.

    Hero Karthi On Pushpa

    ఇక ఎప్పటిలాగే అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ ‘ధన్యవాదాలు’ తెలిపాడు. అయితే, పుష్ప సినిమా గురించి ఇలా వరుసగా ప్రముఖులు మెసేజ్ లు చేయడానికి కారణం బన్నీ టీమ్ అని తెలుస్తోంది. బన్నీ టీం పర్సనల్ గా అందరికీ ఫోన్ చేసి.. పుష్ప గురించి పాజిటివ్ కామెంట్స్ చేయాలని కోరుకుంటున్నారట. ఏది ఏమైనా బన్నీ కాస్త తెలివిగా ముందుకు పోతున్నాడు. కానీ పాన్ ఇండియా స్టార్ కావాలంటే.. ముందు అన్నీ భాషల ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి కదా.

    Also Read: ఖండాంతరాలు దాటుతున్న ‘పుష్ప’ క్రేజ్..!

    అన్నట్టు పుష్ప గురించి మంచు లక్ష్మి కూడా స్పందిస్తూ.. ‘పుష్ప సినిమా అదిరిపోయిందని, మెయిన్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది అని.. బన్నీకి హ్యాట్సాఫ్ అంటూ తెగ ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. అలాగే అతిలోకసుందరి గారాలపట్టి మరియు క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్‌ కూడా పుష్ప పై తెగ ప్రేమను చూపించింది. పుష్ప సినిమా చేసి ఉత్సాహం ఆపుకోలేక వెంటనే సోషల్‌ మీడియాలో మెసేజ్ చేస్తూ ‘ప్రపంచంలోనే కూలెస్ట్‌ మ్యాన్‌’ అంటూ అల్లు అర్జున్‌ నటన పై ప్రశంసలు కురిపించింది జాన్వీ కపూర్‌.

    అసలు హిందీ స్టార్‌ హీరోలు, ప్రొడ్యూసర్లతో పాటు హీరోయిన్లు కూడా పుష్పకి, పుష్ప రాజ్‌ కు ఫిదా అయిపోతున్నారు. అయిపోతున్నారు అనేకంటే.. అయ్యేలా బన్నీ టీమ్ కసరత్తులు చేస్తున్నారు. ‘పుష్ప’ అన్ని వెర్షన్లు కలుపుకుని మొత్తం 156.42 కోట్ల భారీ షేర్ ను రాబట్టి, లాభాల్లోకి వెళ్ళింది. ఎలాగూ రైట్స్ తాలూకు డబ్బులు కూడా ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చాయి.

    Also Read: ‘పుష్ప’ పై మంచు లక్ష్మి కామెంట్స్.. రియాక్ట్ అయిన బన్నీ !

    Tags