https://oktelugu.com/

Corona : సీనియర్ హీరోకి కరోనా.. టెన్షన్ లో ప్రభాస్ !

Corona : మలయాళ చిత్రసీమను ప్రస్తుతం కరోనా బాగా భయపెడుతుంది.   ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కి  కరోనా సోకిన సంగతి తెలిసిందే.  అలాగే  మలయాళీ యాక్ట్రెస్  ‘అన్నా బెన్’కు కూడా   కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.  ఇలా అనేకమంది మలయాళ నటీనటులకు కరోనా సోకింది.  కాగా  తాజాగా పాపులర్ మలయాళ నటుడు, ‘అల.. వైకుంఠపురములో’ ఫేం జయరామ్  కూడా  కరోనా బారిన పడ్డారు.  జయరామ్ కి చేసిన కరోనా  టెస్టుల్లో పాజిటివ్  అని  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 23, 2022 / 08:57 PM IST
    Follow us on

    Corona : మలయాళ చిత్రసీమను ప్రస్తుతం కరోనా బాగా భయపెడుతుంది.   ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కి  కరోనా సోకిన సంగతి తెలిసిందే.  అలాగే  మలయాళీ యాక్ట్రెస్  ‘అన్నా బెన్’కు కూడా   కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.  ఇలా అనేకమంది మలయాళ నటీనటులకు కరోనా సోకింది.  కాగా  తాజాగా పాపులర్ మలయాళ నటుడు, ‘అల.. వైకుంఠపురములో’ ఫేం జయరామ్  కూడా  కరోనా బారిన పడ్డారు. 

    Prabhas

    జయరామ్ కి చేసిన కరోనా  టెస్టుల్లో పాజిటివ్  అని  వచ్చింది. ఈ విషయాన్ని జయరామ్  తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మొత్తానికి సినిమా వాళ్లకు  కరోనా భారీ  సినిమానే  చూపిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో   కరోనా  మూడో వేవ్   కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి.   నిజానికి మలయాళ  సీనియర్ హీరో  జయరామ్ కరోనా విషయంలో మొదటి నుంచి  అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. 

     

    అయినప్పటికీ  ఆయనకు  కరోనా పాజిటివ్ అని  వచ్చింది. ఇదే విషయం పై జయరామ్ స్పందిస్తూ.. ఎంతో జాగ్రత్తగా ఉన్నాను.  అలాగే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను.   అయినా నాకు  కరోనా సోకింది.  కాకపోతే,   తేలికపాటి జ్వరంతో పాటు స్వల్ప లక్షణాలు ఉన్నాయి.  ప్రస్తుతానికి  వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఐసోలేట్ అయినట్లు తెలిపారు. ప్రజలంతా మాస్క్ ధరించి క్షేమంగా ఉండాలని జయరామ్  కోరారు.

     

    జయరామ్,  ‘అల.. వైకుంఠపురములో’   సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను  బాగా  అలరించారు. ఆ సినిమా మంచి విజయాన్ని కూడా సాధించింది.  ప్రస్తుతం ఆయన  ఖాతాలో  భారీ  క్రేజీ ప్రాజెక్ట్‌ లు ఉన్నాయి. అందుకే జయరామ్ కి  కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆయా సినిమాల మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. అలాగే  స్టార్ హీరో ప్రభాస్ కి  కూడా  టెన్షన్  మొదలైంది.  ప్రభాస్ ను  రెండు రోజుల క్రితం జయరామ్  ప్రత్యేకంగా  కలిశాడు.  

     

    ఇప్పుడు  ప్రభాస్  కూడా ఐసోలేషన్‌ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.  అసలు కరోనా మూడో వేవ్  ఇంత వేగంగా  వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు.  వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.  ముఖ్యంగా  నటీనటులకు  వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.  

     

    www.instagram.com/p/CX5A2w8PY6_/