https://oktelugu.com/

Balayya-Boyapati : బాలయ్య – బోయపాటి మాస్ అనౌన్స్ మెంట్ కి అంత రెఢీ.. ఈసారి బాలయ్య క్యారెక్టర్ ఏంటంటే..?

ఇక ఆ పాయింట్ మీదే ఈ సినిమాను తెరకెక్కించాలని బోయపాటి చూస్తున్నాడట. ఇక ఈ స్టోరీ కూడా చాలా అద్భుతంగా వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే బోయపాటి, ఎం రత్నం ఇద్దరూ కలిసి కథకు సంబంధించిన మొత్తం వర్క్ ఫినిష్ చేసి స్టోరీ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2024 / 03:28 PM IST

    balakrishna-and-boyapati-srinu

    Follow us on

    Balayya-Boyapati Combination : సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక వాళ్ల కాంబో లో ఎప్పుడు సినిమాలు వచ్చిన కూడా ఆ సినిమా సక్సెస్ దిశగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి కాంబినేషన్ లో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఒకటి..ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో ఇప్పుడు రాబోయే నాలుగో సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు బోయపాటి కథను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది.

    ఇక ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వీళ్ళ కాంబో లో వచ్చే సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టులో బాలయ్య బోయపాటి సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అప్పుడే ముహూర్తం కూడా స్టార్ట్ చేసి ఆ సినిమాని రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్లే ప్రయత్నాలైతే అయితే సాగుతున్నాయట.. ఇక ఈ సినిమాని 2025 సమ్మర్ కి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట.

    ఈ రెండు పాత్రల్లో ఒకటి ఐఏఎస్ పాత్ర కాగా, మరొకటి రైతు పాత్ర కావడం విశేషం. ఇక ఈ ఆధునిక ప్రపంచంలో కూడా రైతులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళకి అందడం లేదు. “అన్నం పెట్టే రైతన్నకే అన్నం కరువైంది”. అనే కాన్సెప్ట్ ను తెర మీదకి తీస్తూ వాళ్ళకోసం ఫెయిత్ చేసే క్యారెక్టర్ లో బాలయ్య కనిపించబోతున్నాడట.

    ఇక ఆ పాయింట్ మీదే ఈ సినిమాను తెరకెక్కించాలని బోయపాటి చూస్తున్నాడట. ఇక ఈ స్టోరీ కూడా చాలా అద్భుతంగా వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే బోయపాటి, ఎం రత్నం ఇద్దరూ కలిసి కథకు సంబంధించిన మొత్తం వర్క్ ఫినిష్ చేసి స్టోరీ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది…