CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రజల కోసం పలు పథకాలను కూడా అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరొకసారి ఊహించని పరిణామం ఎదురైంది. టాలీవుడ్ లో మరో హీరో సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయాడు. ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో బాలాదిత్య కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో బాలాదిత్య సీఎం రేవంత్ రెడ్డి పేరు ను పలకడంలో ఇబ్బంది పడ్డాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలకడం జరిగింది. ఆ తర్వాత వెంటనే బాలాదిత్య తల పట్టుకొని సవరించుకున్నాడు. ఆ తర్వాత బాలాదిత్య ప్రియమైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరును మరిచిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన యాంకర్ కం హీరోను అరెస్టు చేస్తారని సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక నెల క్రితం కూడా హీరో అల్లు అర్జున్ ఇలాంటి పొరపాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజ్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ సినిమా బెనిఫిట్ షో చూడడానికి హీరో అల్లు అర్జున్ కూడా తన భార్య పిల్లలతో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి వచ్చారు. ఇక పాన్ ఇండియా స్టార్ అక్కడికి రావడం తో చుట్టూ పక్కల నుంచి చాలా మంది అభిమానులు అల్లు అర్జున్ ను చూడడానికి అక్కడకి చేరుకున్నారు.దీంతో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది.
ఇక ఈ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మరియు ఆమె కుమారుడు అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా రేవతి అనే మహిళ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక ఆమె కుమారుడు ఇప్పటికీ ఆసుపత్రిలోనే వైద్యుల పరిరక్షణలో ఉన్నాడు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్ కం హీరో బాలాదిత్య కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును పలకడంలో ఇబ్బంది పడి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికాడు. ఆ తర్వాత తల పట్టుకుని తన తప్పును సవరించుకోవడానికి హీరో బాలాదిత్య మన ప్రియమైన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్ లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.