https://oktelugu.com/

Akkineni Akhil : అక్కినేని అభిమానులకి తీపి వార్త చెప్పబోతున్న అయ్యగారు…

ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం సక్సెస్ ని సాధించాలని కచ్చితంగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ మూవీగా వచ్చిన ఏజెంట్ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అఖిల్ ఒకసారిగా నిరాశకి గురయ్యాడు. అందువల్లే ఆయన ప్రస్తుతం ఒక మంచి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఈ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2024 / 08:21 AM IST
    Follow us on

    Akkineni Akhil : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మొదటి నుంచి నందమూరి ఫ్యామిలీతో పాటు పోటీపడుతూ వస్తున్న అక్కినేని ఫ్యామిలీ ప్రతిసారి మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వస్తుంది. ఇక నాగేశ్వరరావు, నాగార్జున లా తర్వాత నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ ఈ ఫ్యామిలీని నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా అందులో భాగంగానే నాగ చైతన్య కి ఒక మోస్తరుగా సక్సెస్ లు వస్తుంటే అఖిల్ కి మాత్రం సక్సెస్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటివరకు తను తీసిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆడకపోవడం ఆయనకు మార్కెట్ పరంగా భారీ దెబ్బ పడిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ఆయన ఇప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఆ దర్శకుడి నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రానప్పటికీ అఖిల్ మాత్రం తనతో ఒక సినిమా చేసి పెట్టమని అతన్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరు అనేది ఇంకా అఫీషియల్ గా తెలియనప్పటికీ ఇక తెలుగులో ఉన్న దర్శకులు ఎవరు తనకు హిట్ ఇవ్వలేదని ఆలోచించిన అఖిల్ ఏకంగా తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్ ని తెలుగులో దింపబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం సక్సెస్ ని సాధించాలని కచ్చితంగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ మూవీగా వచ్చిన ఏజెంట్ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అఖిల్ ఒకసారిగా నిరాశకి గురయ్యాడు. అందువల్లే ఆయన ప్రస్తుతం ఒక మంచి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఈ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటివరకు ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ కాలేదు. కాబట్టి ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టుగా కోలీవుడ్, టాలీవుడ్ లో వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి అఖిల్ ఈ సినిమాతో అయిన సక్సెస్ కొడతాడా లేదా అనేది…