AKhil: ఫుల్​ జోష్​తో దూసుకెళ్తున్న అఖిల్​.. శరవేగంగా ఏజెంట్​ షూటింగ్​!

AKhil: తనదైన స్టైల్​కు తగ్గట్లు సినిమాలను ఎంచుకుంటూ.. ప్రస్తుత కుర్ర హీరోల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు అఖిల్​. ఎప్పటి నుంచో మంచి హిట్​కోసం ఎదురుచూస్తున్న అఖిల్​కు మోస్ట్​ ఎలిజిబుల్​ ప్యాచ్​లర్​ సినిమా కమర్షియల్​ బ్రేక్​ ఇచ్చిందనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్​ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పూజా హెగ్డె ఇందులో హీరోయిన్​గా అలరించింది. అందమైన ప్రేమకథతో పాటు, కట్టిపడేసే ఎమోషన్స్​తో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ సినిమా. దీంతో తొలి హిట్​కు తన ఖాతాలు వేసుకున్నారు […]

Written By: Raghava Rao Gara, Updated On : November 5, 2021 10:17 am
Follow us on

AKhil: తనదైన స్టైల్​కు తగ్గట్లు సినిమాలను ఎంచుకుంటూ.. ప్రస్తుత కుర్ర హీరోల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు అఖిల్​. ఎప్పటి నుంచో మంచి హిట్​కోసం ఎదురుచూస్తున్న అఖిల్​కు మోస్ట్​ ఎలిజిబుల్​ ప్యాచ్​లర్​ సినిమా కమర్షియల్​ బ్రేక్​ ఇచ్చిందనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్​ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పూజా హెగ్డె ఇందులో హీరోయిన్​గా అలరించింది. అందమైన ప్రేమకథతో పాటు, కట్టిపడేసే ఎమోషన్స్​తో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ సినిమా. దీంతో తొలి హిట్​కు తన ఖాతాలు వేసుకున్నారు అక్కినేని అఖిల్​.

ఇప్పుడు ఇదే జోష్​ను కొనసాగిస్తూ. తన తర్వాత సినిమానూ పూర్తి చేసే పనిలో పడిపోయారు. సురేందర్​రెడ్డి దర్శకత్వంలో అఖిల్​ తన తర్వాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్​ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఏజెంట్​ అనే టైటిల్​ను పెట్టారు. దీంతో అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ కూడా శరవేగంగా సాగుతోంది. ఇటీవలే హంగేరిలో షూట్​ మొదలు పెట్టింది చిత్రబృందం. ఈ సినిమాలో మలహాళ స్టార్​ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన పాత్రపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా, ప్రస్తుతం కొచ్చిలో షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్​లో యాక్షన్​ సీక్వెన్స్​ చిత్రీకరించనున్నారు.  ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు. ఇందులో అఖిల్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి వైద్య  నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Tags