
తెలుగులో ఓటీటీల యుగం మొదలైంది. సహజంగానైతే.. ఓ పదేళ్ల తర్వాత తెలుగు ఆడియన్స్ ఓటీటీలను ఓన్ చేసుకునే వారు. కానీ.. కరోనాతో థియేటర్లు మూతపడడంతో వినోదం కోసం అనివార్యంగా ఓటీటీలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో.. గిరాకీ పెరిగిపోయింది. ఆటోమేటిగ్గా.. వెబ్ సిరీస్ లకూ ప్రాధాన్యం పెరిగింది. వరుసగా ఈ సిరీస్ లు వచ్చేస్తున్నాయి. మరి, ఇందులో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నవి ఏవీ అన్నప్పుడు.. చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో నుంచి ఫిల్టర్ చేసిన ఓ టాప్ 10 వెబ్ సిరీలను మీకోసం అందిస్తున్నాం. చూడండి.. ఎంజాయ్ చేయండి.
10. స్టేజెస్ ఆఫ్ లవ్ః తెలుగులో మొట్ట మొదటి వెబ్ సిరీస్ ఇది. మోనిక, అర్జున్ అనే కపుల్ మధ్య ఈ స్టోరీ మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ వివిధ దశల్లో ప్రేమ ఎలా ఉంటుందో చూపించే చిత్రమిది. ఈ మూవీ టీనేజర్స్ ను చాలా అట్రాక్ట్ చేస్తుంది. లీడ్ రోల్స్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. స్టోరీ కూడా అందరినీ ఆలోచింప చేస్తుంది.
9. నేను నా గర్ల్ ఫ్రెండ్ః ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా సాగిపోతుంది. అర్జున్ కల్యాణ్, అద్రికా శర్మ, ఇంద్రజ వేముగంటి లీడ్ రోల్స్ ప్లే చేశారు. అర్కిటెక్ట్ గా పనిచేసే అర్జున్ లైఫ్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇంటి పక్కన ఉండే శృతిని లవ్ చేసిన కార్తీక్ జీవితంలోకి ఓ కీలక సమయంలో ప్రియా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమైందీ? ఈ ముగ్గురి జీవితాలు ఏ తీరానికి చేరుకున్నాయనేది కథ.
8. పాష్ పోరీస్ః సిటీలో ఉండే ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది. పది ఎపిసోడ్స్ గా రన్ అయ్యే ఈ సిరీస్ లో.. హారిక వేదుల, సహజ చౌదరి, అదితి మైకేల్ నటించారు. ఇండిపెండెంట్ గా జీవించే యువతులు లైఫ్ ను ఎలా లీడ్ చేశారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారన్నది స్టోరీ.
7. ఎందుకిలాః తెలుగు ఫిల్మ్ సర్కిల్స్ లోనే ఇదొక బ్రాండ్ న్యూ వెబ్ సిరీస్. కామెడీ ప్రధానంగా సాగే ఈ సిరీస్ అన్ని ఏజ్ గ్రూపుల వారినీ ఎంటర్ టైన్ చేస్తుంది. బ్యాడ్ లక్ ను బ్యాక్ పాకెట్లో పెట్టుకు తిరిగేవాడి స్టోరీ ఇది. ఏ పని చేసినా రివర్స్ కొట్టేసే ఓ యువకుడు ప్రేమలో పడిపోతాడు. మరి, ఈ బ్యాడ్ లక్ బాయ్ తన లవ్ ను ఎలా గెలుచుకున్నాడన్నదే స్టోరీ. ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ప్రతీ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. లక్ష్మణ్ కార్య తెరకెక్కించిన ఈ మూవీలో సుమంత్ అశ్విన్, యామినీ భాస్కర్ లీడ్ రోల్స్ లో నటించారు.
6. నేను మీ కల్యాణ్ః ఇది కామెడీ మిక్స్ చేసిన లవ్ ఎంటర్ టైనర్. కేరింత మూవీ ఫేమ్ విశ్వంతద్, శాలినీ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీలో కామెడీ నాచురల్ గా సాగిపోతుంది. రేడియో జాకీగా పనిచేసే కల్యాణ్ లవ్ స్టోరీనే ఈ మూవీ కథ. తనకు పరిచయమైన అమ్మాయిని సొంతం చేసుకునేందుకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ తో ట్రయల్స్ వేస్తుంటాడు. మరి, చివరకు తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది తెరపై చూడాలి.
5. పిల్లః తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ధన్య బాలకృష్ణ, అనిరుధ్ తోటపల్లి లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ పిల్ల. పెళ్లికి ముందు గర్భవతి అయిన యువతి కథ. అర్బన్ కామెడీ బేస్ తో సాగిపోయే ఈ చిత్రంలో కాస్త అడల్ట్ డోస్ కూడా ఉంటుంది. పది ఎపిసోడ్లుగా ఉండే ఈ చిత్రాన్ని పవన్ సాధినేని తెరకెక్కించారు.
4. పెళ్లిగోలః ఇదొక నేచురల్ హ్యూమర్ స్టోరీ. బిగ్ బాస్ -4 విన్నర్ అభిజీత్, వర్షిణి సౌందరాజన్ లీడ్ రోల్స్ లో నటించారు. అరేంజ్ మ్యారేజ్ ఇష్టం లేని జంటకు పెద్దలు పట్టుబట్టి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతారు. దాన్నుంచి తప్పించుకునేందుకు వీళ్లు ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్ లవ్ లో పడతారు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
3. గీతా సుబ్రహ్మణ్యంః లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండే ఓ జంట కథ ఇది. సాధారణంగా ప్రతీ జంట మధ్య వచ్చే అపార్థాలను హైలెట్ చేస్తూ సాగిపోతుందీ మూవీ. దీనికి హ్యూమర్ ను జత చేసిన డైరెక్టర్.. చివరకు వరకూ క్యూరియాసిటీని మెయింటెయిన్‌చేశాడు. దర్శిని శేఖర్, మనోజ్ క్రిష్ణ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ డే బై డే పాపులర్ అవుతోంది.
2. మహాతల్లిః డైలీ లైఫ్ లో వచ్చే సన్నివేశాలను వీడియోలుగా షూట్ చేసే ఓ యువతి కథ ఇది. జాహ్నవి దేశెట్టి లీడ్‌రోల్ ప్లే చేసింది. జనాన్ని ఎంటర్ టైన్ చేయడానికి వీడియోలు రూపొందిస్తూ ఉంటుంది. ఆమె వీడియోలు నేచురల్ గా, షార్ట్ గా, హిలేరియస్ గా ఉంటాయి. ఈ కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన మహాతల్లి వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
1. ముద్దపప్పు ఆవకాయః ఇదిలాంటి వెబ్ సిరీస్ ఇప్పటి వరకు తెలుగులో రాలేదు. మెగా డాటర్ నిహారిక కొనిదెల, ప్రతాప్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. అరేంజ్డ్ మ్యారేజ్ కు ముందు ప్రేమలో పడే ఓ జంట కథ ఇది. ఈ క్రమంలో వచ్చే కామెడీ, సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రణీత్ బ్రహ్మాండపల్లి తెరకెక్కించిన ఈ మూవీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది చూసిన వారు ఖచ్చితంగా మంచి అనుభూతి పొందుతారు.