క‌ర్ణ‌న్ సినిమాలో 5 సీక్రెట్స్ ఇవే!

కుల దుర‌హంకారంపై ధనుష్ విసిరిన ఖడ్గం ‘అసుర‌న్’. సమాజంలోని దారుణాన్ని కళ్లకు కట్టిన ఆ చిత్రం త‌ర్వాత లేటెస్ట్ గా ఎక్కుపెట్టిన మ‌రో అస్త్రం ‘క‌ర్ణ‌న్’. అణగారిన వర్గాల బ‌తుకే ముళ్ల‌బాట‌గా మారిన చోట‌.. నిత్య‌జీవితంలో ఎదుర‌య్యే చేదుఅనుభ‌వాలను క‌ళ్ల‌కు క‌ట్టాడు ద‌ర్శ‌కుడు మారి సెల్వ‌రాజ్‌. మ‌రోసారి పాత్ర‌కు ప్రాణం పోసిన ధ‌నుష్‌.. త‌న‌దైన న‌ట‌న‌తో చెల‌రేగిపోయాడు. ప్ర‌స్తుతం ఓటీటీలో ఉన్న ఈ సినిమా మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో దూసుకెళ్తోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్న ఈ చిత్రాన్ని […]

Written By: NARESH, Updated On : May 23, 2021 10:34 am
Follow us on

కుల దుర‌హంకారంపై ధనుష్ విసిరిన ఖడ్గం ‘అసుర‌న్’. సమాజంలోని దారుణాన్ని కళ్లకు కట్టిన ఆ చిత్రం త‌ర్వాత లేటెస్ట్ గా ఎక్కుపెట్టిన మ‌రో అస్త్రం ‘క‌ర్ణ‌న్’. అణగారిన వర్గాల బ‌తుకే ముళ్ల‌బాట‌గా మారిన చోట‌.. నిత్య‌జీవితంలో ఎదుర‌య్యే చేదుఅనుభ‌వాలను క‌ళ్ల‌కు క‌ట్టాడు ద‌ర్శ‌కుడు మారి సెల్వ‌రాజ్‌. మ‌రోసారి పాత్ర‌కు ప్రాణం పోసిన ధ‌నుష్‌.. త‌న‌దైన న‌ట‌న‌తో చెల‌రేగిపోయాడు. ప్ర‌స్తుతం ఓటీటీలో ఉన్న ఈ సినిమా మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో దూసుకెళ్తోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్న ఈ చిత్రాన్ని సెల్వ‌రాజ్ తెర‌కెక్కించిన తీరుకు ఎవ్వ‌రైనా ముగ్ధుల‌వ్వాల్సిందే.

అయితే.. క‌థ కోసం స‌న్నివేశాల‌ను అల్లుకోవ‌డం అంద‌రికీ తెలిసిన‌ ప‌ద్ధ‌తి. కానీ.. స‌న్నివేశాల‌ను క‌థ‌లోనే భాగం చేయ‌డం కొంద‌రికి మాత్రమే సాధ్య‌మయ్యే నేర్పు. అలాంటి ద‌ర్శ‌కుల్లో ఖ‌చ్చితంగా సెల్వరాజ్ ఉంటాడని చెప్పొచ్చు. ప్ర‌త్యేకించి ఈ సినిమాలోని పాత్ర‌ల‌ను క‌థ‌లో లీనం చేసిన ప‌ద్ధ‌తిని ఖ‌చ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అంత‌కు మించి అన్న‌ట్టుగా స‌న్నివేశాల్లో అంత‌ర్లీనంగా చూపించిన ప‌లు అంశాలు స‌మాజంలోని అస‌మాన‌త‌ను సూటిగా విమ‌ర్శిస్తుంటాయి. ఇలాంటి ఐదు అంశాల‌ను ఈ సినిమాలో గ‌మ‌నించొచ్చు.

ఈ సినిమాను మ‌హాభార‌తం నుంచి ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు సెల్వ‌రాజ్‌. ధ‌ర్మంపై అధ‌ర్మం చెలాయిస్తున్న పెత్త‌నాన్ని విపులంగా చూపించాడు. ఇందుకుగానూ.. క్యారెక్ట‌ర్ల పేర్ల‌ను మ‌హాభార‌తంలో నుంచే తీసుకోవ‌డం విశేషం. హీరో ధ‌నుష్ పేరు క‌ర్ణుడి నుంచి తీసుకున్న‌దే. హీరోయిన్ పేరు ద్రౌప‌ది. ఇక‌, ప్ర‌ధాన క్యారెక్ట‌ర్ పేరు ధుర్యోద‌నుడు. పోలీస్ పేరు శ్రీకృష్ణుడిని పోలి ఉంటుంది. ఈ విధంగా చాలా పాత్ర‌ల పేర్లు మ‌హాభార‌తంలోనుంచి తీసుకున్న‌వే ఉంటాయి.

ఇక‌, రెండో అంశం ఏమంటే.. ఈ చిత్రంలోని ప్ర‌ధాన స‌న్నివేశాల్లో జంతువుల‌ను చూపించాడు ద‌ర్శ‌కుడు. క‌ర్ణ‌న్ ఏనుగు మీద, ఆ త‌ర్వాత గుర్రం మీద క‌నిపిస్తాడు. మ‌రికొన్ని స‌న్నివేశాల్లో అగ్ర‌కులానికి చెందిన పోలీసు.. త‌క్కువ జాతివారిని హీనంగా చూస్తూ దాడిచేసే స‌మయంలో పురుగు, న‌త్త‌ను చూపిస్తాడు. ఇక‌, వృద్ధుడి పాత్ర‌ పందులను పెంచుతుంది. ఒక స‌న్నివేశంలో గ‌ద్ద కోడి పిల్లను ఎత్తుకుపోవ‌డాన్ని చూపిస్తాడు. త‌ద్వారా.. స‌మాజంలో బ‌ల‌వంతుడు బ‌ల‌హీనుల‌పై ఎలా దాడిచేస్తాడ‌న్న‌ది చూపించాడు ద‌ర్శ‌కుడు. ఇక‌, చాలా సీన్ల‌లో రెండుకాళ్లు క‌ట్టేసిన‌ గాడిద‌ను చూపిస్తాడు. ఇలా.. ప్ర‌తీ ఇంపార్టెంట్ సీన్ లో ఏదో ఒక జంతువును చూపించారు.

నాలుగో అంశం బొమ్మ‌ల‌ను ఉప‌యోగించ‌డం. హీరో చెల్లి బొమ్మ‌ను దేవ‌త విగ్ర‌హంగా చూపిస్తారు. క‌ర్ణ‌న్ ఎంట్రీలో కూడా ధ‌నుష్ బొమ్మ‌ను చూపిస్తాడు ద‌ర్శ‌కుడు. బొగ్గుతో మంట‌తో చిత్రించిన‌ట్టుగా ఉండే బొమ్మ‌ను చూపిస్తాడు. ఇలా చాలా సీన్లు బొమ్మ‌ల‌ను చూపించారు. ఐదో అంశం నేచ‌ర్ ను బేస్ చేసుకోవ‌డం. ఈ చిత్రంలో నేచర్ కూ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. చాలా చోట్ల నీటిని, ఆకాశాన్ని చూపిస్తుంటాడు. ప్ర‌కృతిని కూడా భాగం చేశాడు. ధ‌నుష్ నీటిలో చేప‌ను రెండుగా న‌ర‌క‌డం, ప్రేమ విష‌యంలో బాధ‌ప‌డుతూ నీళ్ల‌లో కాళ్లు పెట్టుకొని కూర్చోవ‌డం.. త‌న చెల్లి బొమ్మను నీటిలో చూపించ‌డం.. ఇలా నేచ‌ర్ కు చాలా ప్రాముఖ్యం ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. కులం పేరుతో స‌మాజాన్ని విడ‌దీసే తీరును కళ్లకు కట్టినట్టు చూపించిన ‘క‌ర్ణ‌న్‌’ చిత్రం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇప్పటి వరకు చూడకపోతే.. ఇప్పుడే చూసేయండి.