Bigg Boss 7 Telugu: మరో ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. నేడు ఆదివారం కాగా నామినేషన్స్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు సరుకోవాల్సి ఉంది. వైల్డ్ కార్డు ఎంట్రీతో అంబటి అర్జున్, నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి, భోలే షావలి హౌస్లో అడుగుపెట్టారు. నామినేషన్స్ ప్రక్రియ పాత కొత్తవాళ్లతో కలిపి జరిపారు. ఈ క్రమంలో అమర్ దీప్, తేజా, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, నయని పావని, పూజా మూర్తి, అశ్వినిశ్రీ నామినేట్ అయ్యారు.
సందీప్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. అయితే సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చిన గౌతమ్ తనకు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో అతన్ని నామినేషన్స్ నుండి సేవ్ చేశాడు. మంగళవారం నుండి ఓటింగ్ మొదలైంది. ప్రిన్స్ యావర్ అత్యధికంగా ఓట్లు పొందినట్లు తెలిసింది. అతడికి ముప్పై శాతానికి పైగా ఓట్లు పడ్డాయట. తర్వాత స్థానంలో అమర్ దీప్ ఉన్నాడట. ఇక మూడో స్థానంలో తేజా, నాలుగో స్థానంలో అశ్విని శ్రీ ఉన్నట్లు సమాచారం.
చివరి మూడు స్థానాల్లో నయని పావని, పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నట్లు తెలిసింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన శోభా శెట్టి ఎలిమినేట్ కావడం ఖాయం అన్నారు. అనూహ్యంగా నయని పావని పేరు తెరపైకి వచ్చింది. నేడు ఇంటిని వీడేది ఆమెనే అంటున్నారు. శోభా శెట్టిని కాపాడేందుకు ఓటింగ్ కి వ్యతిరేకంగా నయని పావని ఎలిమినేషన్ జరుగుతుందనే ప్రచారం మొదలైంది. గత సీజన్స్ లో కూడా కొన్ని ఎలిమినేషన్స్ విమర్శలకు తావిచ్చాయి.
నయని పావని ఎలిమినేషన్ అలాంటిదే అంటున్నారు. మరోవైపు ఎలిమినేట్ అయిన ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ నుండి ముగ్గురు మరలా హౌస్లో అడుగుపెట్టారు. అయితే వీరిలో ఒకరికే హౌస్ మేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది నిర్ణయించేది ఇంటి సభ్యులే. మెజారిటీ ఎవరికి ఓటు వేస్తారో వారు మరలా హౌస్లో అడుగుపెట్టవచ్చు. మరి చూడాలి ఎవరికి ఆ బంపర్ ఆఫర్ దక్కుతుందో…