Hello Movie Child Artist: అక్కినేని అఖిల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలు ఒక్కటి కూడా లేకపోయినా, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ గా పేరు తెచ్చుకున్న చిత్రం మాత్రం ఒకటి ఉంది, అదే ‘హలో’. అక్కినేని ఫ్యామిలీ కి ‘మనం’ లాంటి అద్భుతమైన కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఫస్ట్ హాఫ్ చాలా చక్కగా తీసాడు కానీ, సెకండ్ హాఫ్ మధ్యలో నుండి సినిమా బాగా డౌన్ అవ్వడంతో, కమర్షియల్ గా ఈ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ నార్త్ అమెరికా లో మాత్రం అప్పట్లో 1 మిలియన్ మార్కుని అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమెకు మొదటి సినిమా. ఆ తర్వాత మలయాళం లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయ్యింది.
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కల విషయానికి వస్తే, అప్పట్లో అక్కినేని అఖిల్ కి నాగార్జున వారసుడిగా మంచి క్రేజ్ ఉండేది. మార్కెట్ లో డిమాండ్ కూడా తారా స్థాయిలో ఉండేది. పైగా ఇది ఆయన రెండవ సినిమానే అవ్వడం, మనం లాంటి క్లాసిక్ ని అందించిన విక్రమ్ కె కుమార్ నుండి తెరకెక్కిన సినిమా కావడంతో 32 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కేవలం 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. జానర్ కి తగ్గట్టు డీసెంట్ స్థాయి రేట్స్ కి ఈ సినిమాని అమ్మి ఉండుంటే కచ్చితంగా లాభాలను రాబట్టి ఉండేదని అప్పట్లో అనేవారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రం లో హీరో హీరోయిన్ చైల్డ్ హుడ్ సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ విక్రమ్. ఈ సినిమాకు హైలైట్ గా నిల్చిన సన్నివేశాలు ఇవే. హీరోయిన్ జున్ను చిన్నప్పటి క్యారక్టర్ లో కనిపించిన చిన్నారి పేరు మైరా దండేకర్. చాల క్యూట్ మాటలతో అప్పట్లో ఈ చిన్నారి ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. ఈ చిత్రం విడుదలై ఇప్పుడు దాదాపుగా 9 ఏళ్ళు కావొస్తుంది. మైరా పెరిగి బాగా పెద్ద అమ్మాయి అయిపోయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను చూసి నెటిజెన్స్ నోరెళ్లబెట్టారు. ముఖ్యంగా ఒక పాటకు ఆమె వేసిన హాట్ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం ఆర్టికల్ చివర్లో అందిస్తున్నాం చూడండి. అందం లో ఈమె నేటి తరం యంగ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.