అందాల ‘హెబ్బా పటేల్’కి ఈ మధ్య పెద్దగా సినిమాలు లేవు. ప్లాప్ ల వలయంలో హీరోయిన్ గా విలువ కోల్పోయి.. ఛాన్స్ లు కోసం హెబ్బా తెగ ఆశగా ఎదురుచూస్తోంది. నిజానికి చిన్న సినిమాతో అప్పట్లో ఫుల్ డిమాండ్ తెచ్చుకుంది. అసలు మూడు సంవత్సరాల క్రితం వరకూ హెబ్బాకి ఉన్న డిమాండ్ చూస్తే, తోటి చిన్నాచితకా హీరోయిన్స్ అందరూ.. హెబ్బా అంటేనే అబ్బా అనుకున్నేవాళ్లు. కానీ వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో హెబ్బా మిస్ లీడ్ అయింది.
దాంతో వరుస అవకాశాలతో మంచి జోరు మీదున్న హెబ్బా కెరీర్, ఒక్కసారిగా రివర్స్ అయింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకునే హెబ్బాకి, చివరకు అవకాశమే లేకుండా పోయింది. అందుకే ఛాన్స్ ల కోసం మళ్ళీ తనలోని గ్లామర్ బ్యూటీని నిద్ర లేపింది. వరుస హాట్ ఫోటోషూట్ లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో షాకిచ్చే పోజులు ఇచ్చి.. కురాళ్లను టార్గెట్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో వదిలిన ఓ హాట్ హాట్ ఫోటో హీటెక్కిస్తోంది.
బ్లాక్ డ్రెస్ లో అలాగే మరో ఫొటోలో వైట్ డ్రెస్ లో హెబ్బా సెక్సీగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అంతా.. బాబోయ్ .. హెబ్బా బ్లాక్ డ్రెస్ లో హీటెక్కిస్తోంది అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి హెబ్బా పటేల్.. ఇప్పుడు ఫుల్ గ్లామర్ రోల్స్ కు కూడా తాను రెడీ అనే తరహాలో హెబ్బా ఈ హాట్ ఫోటో షూట్ ఇవ్వడంతో, మరి ఆమెకు ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి. ఇప్పటి వరకు చిన్నా చితక సినిమాలతోనే సరిపెట్టుకున్న హెబ్బా, ఈ గ్లామర్ షోతో మంచి అవకాశలను అందుకుంటుందేమో చూడాలి.