
Heart attack : మనుషుల ప్రాణాలు మరీ సున్నితం అయిపోయాయి. ఎప్పుడు ఎవరు ఎలా కన్నుమూస్తారో తెలియడం లేదు. గుండె ఆగి మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్టులు, హార్ట్ అటాక్లు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది హీరో పునీత్ రాజ్ కుమార్ హార్ట్ అటాక్ తో కన్నుమూశారు. తాజాగా హీరో తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి మరణించాడు. డాక్టర్స్ ఎంత శ్రమించినా ఆయన్ని కాపాడుకోలేకపోయారు.
తాజాగా అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. కేవలం 19 ఏళ్ల కుర్రాడు కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశాడు. బంధువుల పెళ్ళిలో సరదాగా డాన్స్ చేస్తూ మృత్యువాతపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన యువకుడు… తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. తెలంగాణా రాష్ట్రంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో ఉండే ముత్యం బంధుల పెళ్లి నేపథ్యంలో నిర్మల్ వచ్చాడు. రాత్రి వేళ పెళ్లి వేడుకలో అందరూ సరదాగా గడుపుతున్నారు. డాన్సులు చేస్తున్నారు. ఈ క్రమంలో ముత్యం హీరో రవితేజ నటించిన ఇడియట్ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ కి డాన్స్ చేస్తున్నాడు. చుట్టూ ఉన్న మిత్రులు, బంధువులు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ముత్యం డాన్స్ చేస్తూ చేస్తూ ముందుకు పడిపోయాడు.
ఎలాంటి చలనం లేకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. పెళ్లి వేడుకలో జరిగిన ఈ ఊహించని సంఘటన అందరినీ విషాదంలో నింపివేసింది. ముత్యం పేరెంట్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. వేడుక కోసం వస్తే ఘోరం చోటు చేసుకుందని పలువురు వాపోతున్నారు. ముత్యం ప్రాణాలు వదిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన జనాలు విధి ఎంత విచిత్రం. మనిషి ప్రాణాలకు గ్యారంటీ లేదంటున్నారు. 19 ఏళ్ల యువకుడు హార్ట్ ప్రాబ్లమ్ తో మరణించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
On Camera, 19-Year-Old Dancing At Wedding Collapses, Dies. The tragic incident took place in Nirmal District where Mutyam who had come from Maharashtra suffered a #heartattack while dancing. He was shifted to the hospital where the doctor declared him brought dead. #Telangana pic.twitter.com/NbZ0WzrInX
— Ashish (@KP_Aashish) February 26, 2023