Crazy Director: ‘ఒకే ఒక జీవితం’తో డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు శ్రీ కార్తీక్. ఈ సినిమా కేవలం శ్రీ కార్తీక్ కి విజయాన్ని మాత్రమే అందించలేదు. దర్శకుడిగా శ్రీ కార్తీక్ కి గౌరవాన్ని కూడా పెంచింది. ‘ఒకే ఒక జీవిత’ తరవాత శ్రీ కార్తీక్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు ?, ఎవరితో చేస్తాడు ?, ఈసారి ఎలాంటి జోనర్ ఎంచుకోబోతున్నాడు ?, అనే విషయాలపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఒక కొత్త దర్శకుడి పై ఈ స్థాయి ఆసక్తి చూపించడం విశేషం.

ఒకప్పుడు ‘ఒకే ఒక జీవితం’ లాంటి సినిమా తీసిన దర్శకుడిని స్టార్ హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ, కాలం మారింది. డిఫరెంట్ డైరెక్టర్లకు డిమాండ్ పెరిగింది. ఈ లిస్ట్ లో కచ్చితంగా శ్రీ కార్తీక్ కి కూడా ప్లేస్ ఉంటుంది. అందుకే.. శ్రీ కార్తీక్ కి ఇప్పుడు అడ్వాన్స్ లు కూడా పెరిగాయి. ప్రస్తుతానికి అయితే, శ్రీ కార్తీక్ సితారా ఎంటర్ టైన్మెంట్స్ కోసం ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
ప్రస్తుతం కథ కూడా రెడీ అవుతోంది. ఇది కూడా ‘ఒకే ఒక జీవితం’ లానే ఓ పిరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. అయితే ఈసారి ఇందులో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలు ఉంటారని టాక్ నడుస్తోంది. పైగా ఇది శ్రీ కార్తీక్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిదని తెలుస్తోంది. ఈ కథ చేయాలన్న ఆలోచన శ్రీ కార్తీక్ కి ఎప్పటి నుంచో ఉంది. కానీ… ఓ మంచి హిట్టు కొట్టి, నమ్మకాన్ని సంపాదించి, అప్పుడు తన కలల సినిమా తీయాలనుకొన్నాడట.

మొత్తానికి ఇప్పుడు శ్రీ కార్తీక్ కి ఆ అవకాశం వచ్చింది. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలియాలి. బహుశా నితిన్, నాని, వరుణ్ తేజ్, సాయి తేజ్ లాంటి హీరోలే ఉండొచ్చు. మరో నెల రోజుల్లో శ్రీ కార్తీక్ తదుపరి సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకువెళ్తుంది.
ఒకే ఒక జీవితం’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లు జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్. పైగా నేటికీ ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అందుకే ఓటీటీ రిలీజ్ పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. సోనీ లీవ్ 15 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. వచ్చే నెల రెండో వారం నుంచి ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది అని తెలుస్తోంది.