HBD Superstar Krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్ (ANR) లను రెండు కండ్లు గా అభివర్ణిస్తూ ఉంటారు. ఇక వీళ్ల తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారనే చెప్పాలి… 1943వ సంవత్సరం మే 31 బుర్రిపాలెం లో జన్మించిన సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ ఇండస్ట్రీకి ఎంట్రీ అయితే ఇచ్చాడు. ఇక ఆయన హీరోగా మారిన తర్వాత వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకునే ప్రయత్నం కూడా చేశాడు. మొత్తానికి అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది… 1965 వ సంవత్సరంలో ‘తేనె మనసులు’ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణ ఆ సినిమాతో మంచి ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. ఇక 1966వ సంవత్సరంలో ‘గూడచారి 116’ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ నిలిచాడు. అల్లూరి సీతారామరాజు, మీనా, సింహాసనం, ముందడుగు లాంటి ఎన్నో గొప్ప సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకునేవాడు.
ఇక ఇండస్ట్రీకి మొదటి కలర్ సినిమాను తీసుకు వచ్చిన హీరో కూడా తనే కావడం విశేషం…అలాగే హాలీవుడ్ లో వచ్చిన ‘మెకనాస్ గోల్డ్’ లాంటి సినిమా స్ఫూర్తితో ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే సినిమా తీసి మొదటి కౌబాయ్ సినిమాని చేసిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
Also Read: మొగలిరేకులు సీరియల్ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా..!
ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేసి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. ఇక కృష్ణ తో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఎందుకంటే అతను ప్రొడ్యూసర్ హీరో గా ఉండేవాడు. ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు తన రెమ్యూనరేషన్ ను సైతం వెనక్కి తిరిగి ఇచ్చేసిన మొట్టమొదటి హీరోగా సూపర్ స్టార్ కృష్ణకు ఒక అరుదైన గుర్తింపైతే ఉంది… ఎంత పెద్ద డైలాగు అయిన సరే సింగిల్ టేక్ లో చెప్పి మెప్పించగలిగే ఏకైక నటుడు కూడా తనే కావడం విశేషం.
ఇక ఈరోజు కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా అతని అభిమానులు అలాగే ఆయన కొడుకు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సైతం అతని గురించి ఒకసారి స్మరించుకున్నారు. ఇక కృష్ణ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘ఖలేజా’ సినిమాని రీ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో పెద్దగా సక్సెస్ ను సాధించకపోయిన కూడా రీరిలీజ్ లో మాత్రం భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం.