HBD Anupama : అనుమప పరమేశ్వరన్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా ఉన్న అమ్మడు హాట్ గర్ల్ గా తయారైంది. 2015లో విడుదలైన ప్రేమమ్ భారీ హిట్. ఈ మలయాళ చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘అ ఆ’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరో అంటే ఇష్టపడే విలన్ కూతురు పాత్ర చేసింది. అ ఆ మూవీలో సమంత ప్రధాన హీరోయిన్ గా చేసింది.
తెలుగు ప్రేమమ్ లో కూడా అనుపమ పరమేశ్వరన్ కి ఛాన్స్ వచ్చింది. శతమానం భవతి మూవీతో సోలో హీరోయిన్ గా హిట్ కొట్టింది. అనంతరం ఆమెకు చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. రామ్ పోతినేని, నాని వంటి హీరోలతో జతకట్టింది. రాక్షసుడు మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జంటగా నటించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ విజయం సాధించింది. ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్ కెరీర్ నెమ్మదించింది.
కార్తికేయ 2 చిత్రంతో మరలా ఫార్మ్ లోకి వచ్చింది. కార్తికేయ 2 భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. లేటెస్ట్ రిలీజ్ ఈగల్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ లేడీ జర్నలిస్ట్ రోల్ చేసింది. రవితేజ హీరోగా నటించిన ఈగల్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. నెక్స్ట్ అనుపమ టిల్లు స్క్వేర్ చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీలో అనుపమ హద్దులు దాటేసి బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. సిద్ధూ జొన్నలగడ్డతో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలు చేసింది.
టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదల కానుంది. ట్రైలర్ విడుదల కాగా విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కాగా ఫిబ్రవరి 18న అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. బీచ్ లో మద్యం తాగుతూ విహరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో చేసిన యూత్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సదరు వీడియో వైరల్ అవుతుంది.