Homeఎంటర్టైన్మెంట్Rishab Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టి అందమైన ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..?

Rishab Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టి అందమైన ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..?

Rishab Shetty: రిషబ్ శెట్టి పేరు గత ఏడాది దేశవ్యాప్తంగా వినిపించింది . ఒక్క చిత్రంతో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార(Kantara) సంచలనం సృష్టించింది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన కాంతార రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రిషబ్ శెట్టి టేకింగ్ తో పాటు ఆయన నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తెలుగులో సైతం కాంతార భారీ లాభాలు పంచింది.

కాంతార సక్సెస్ నేపథ్యంలో దానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. కాంతార 2(Kantara 2) ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇక రిషబ్ శెట్టి కెరీర్ పరిశీలిస్తే 2012లో నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం 2016లో విడుదలైన రిక్కీ. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కిరిక్ పార్టీ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందాన(Rashmika Mandanna) హీరోయిన్ కావడం విశేషం. దర్శకత్వం వహిస్తూనే నటుడిగా కొనసాగుతూ వచ్చాడు.

Also Read: Director Teja: ఫస్ట్ టైమ్ స్టార్ హీరో ను డైరెక్షన్ చేయనున్న తేజ…

రిషబ్ శెట్టి రచయిత, నిర్మాత కూడాను. రిషబ్ శెట్టి 2017లో ప్రగతి శెట్టిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. ప్రగతి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫోటోలు, వ్యక్తిగత విషయాలు అభిమానులతో షేర్ చేస్తుంది. ప్రగతి శెట్టి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రిషబ్ శెట్టి ఫ్యామిలీ చాల క్యూట్ గా ఉంది. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.

Also Read: Vikramarkudu 2: విక్రమార్కుడు 2 సినిమాలో రవితేజ హీరోగా చేయడం లేదా..? మరి ఎవరు చేస్తున్నారు..?

మరోవైపు కాంతార 2 కోసం ఇండియా వైడ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో కాంతార 2 బడ్జెట్ భారీగా పెంచినట్లు సమాచారం. ఈ ఏడాది కాంతార 2 థియేటర్స్ లోకి రానుంది. కాంతార 2 చిత్రంతో మరో భారీ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rishab Shetty (@rishabshettyofficial)

RELATED ARTICLES

Most Popular