Prabhudeva Second Wife: సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఓ సాంగ్ కు డ్యాన్స్ బాగుందంటే అందుకే కొరియోగ్రాఫర్ టాలెంట్ మాత్రమే. నార్త్ నుంచి సౌత్ వరకు ఇండియన్ మైకెల్ జాక్షన్ గా పేరు సంపాదించాడు ప్రభుదేవా. దశాబ్దాలుగా స్టార్ హీరోలందరితో డ్యాన్స్ చేయించిన ప్రభుదేవా కేవలం నృత్యకారుడిగానే కాకుండా హీరోగా, సైడ్ హీరోగా, దర్శకుడిగా పలు చిత్రాలు తీశాడు. సినీ రంగంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న ప్రభుదేవా పర్సనల్ లైఫ్ మాత్రం అగమ్యగోచరంగా మారింది. గతంలో ఆయన నయనతారను పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత వీరు విడిపోవడంతో ప్రభుదేవా తీవ్ర నిరాశ చెందారు. ఈ క్రమంలో ఆయన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
2020లో హిమని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రభుదేవా తన రెండో భార్యను ఎప్పుడూ బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. అంతేకాదు ఆమె డాక్టర్ అని తెలుస్తోంది. అయితే ఇటీవల వీరిద్దరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చాలా మంది అక్కడున్నవారు ప్రభుదేవా తో పాటు ఆయన రెండో భార్యను కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ ప్రభుదేవా ఎవరితోమాట్లాడడానికి ఒప్పుకోలేదు. నేరుగా ఆయన ఆలయంలోకి వెళ్లిపోయారు.
ఎన్నో ప్రేమ చిత్రాల్లో నటించి.. మరెన్నో చిత్రాలు తీసిన ఆయన రియల్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి అనేవి విషాదంగా మారాయని అంటున్నారు. మొదటి భార్యతో కలిసి ఉన్న సమయంలో నయనతారతో ప్రేమలో పడ్డారు. అయితే ఆమె డైరెక్టర్ విఘ్నేష్ ను పెళ్లి చేసుకోవడంతో ప్రభుదేవా తీవ్ర నిరాశ చెందారు. నయనతార తో కలిసి ఉండేందుకే ఆయన మొదటి భార్యకు కోట్ల రూపాయల భరణం ఇచ్చారని అన్నారు. కానీ నయనతార వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచి ప్రభుదేవా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు.
ఇటీవల ఆయన తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆయన గురించి సోషల్ మీడియాలో తెగచర్చ సాగుతోంది. ఇక ప్రభుదేవా చివరిసారిగా సల్మాన్ ఖాన్ తో ‘రాధే’ చిత్రాన్ని తీశారు. ఆ తరువాత పలు సినిమాలను ప్రకటించినప్పటికీ అవి లైన్లోకి రాలేదు. ఫ్యామిలీ సమస్యల వల్ల ఆయన సినిమాలపై ఇంట్రెస్టు పెట్టడం లేదని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆయనలైఫ్ సెటిలైనట్లేనా? లేదా? చూడాలి.