Director Teja Son Amitov Teja: కొత్తవాళ్లను ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందుండే డైరెక్టర్ తేజ(Director Teja). మన టాలీవుడ్ కి ఆయన ఎంతో మంది టాలెంటెడ్ ఆరిస్ట్స్ ని పరిచయం చేసాడు. ఉదయ్ కిరణ్,నితిన్,రీమాసేన్, నవదీప్, కాజల్ అగర్వాల్ ఇలా ఒక్కరా ఇద్దరా..చెప్పుకుంటూ పోతే లిస్ట్ పోతూనే ఉంటుంది. కొత్త వాళ్ళతోనే ఆయన ఇండస్ట్రీ ని షేక్ చేసే సంచలనాత్మక చిత్రాలను తీసాడు. తేజ సినిమా అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా అతి తక్కువ కాలం లోనే ఒక పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆయన కెరీర్ లో సంచలనాత్మక హిట్ చిత్రాలు ఎన్ని అయితే ఉన్నాయో, ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా అన్నే ఉన్నాయి. ఈమధ్య కాలం లో ఆయన చేసిన సినిమాల్లో సూపర్ హిట్ గా నిల్చింది ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చిత్రం. రానా దగ్గుబాటి హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యింది.
ఈ చిత్రం తర్వాత ఆయన తీసిన సీత, అహింస చిత్రాలు మాత్రం కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇదంతా పక్కన పెడితే తేజ కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరు అమితోవ్ తేజ, మరో కొడుకు పేరు ఆరవ్ తేజ. చిన్న కొడుకు ఆరవ్ తేజ అనారోగ్యం తో 2011 వ సంవత్సరం లోనే చనిపోయాడు. ఇక పెద్ద కొడుకు అమితోవ్ మాత్రం చదువు పూర్తి చేసుకొని సినిమాల్లోకి రావడానికి సిద్ధం గా ఉన్నాడు. ఈయనకు సంబంధించిన లేటెస్ట్ లుక్ సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. కుర్రాడు చాలా బాగున్నాడే, ఇతనిలో ఎదో స్పార్క్ ఉంది, టాలెంట్ ఉంటే ఇండస్ట్రీ లో హీరో గా కూడా రాణిస్తాడు అని అంటున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే ఈయన మొదటి సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి అట.
Also Read: అమితాబ్ వైపు చూస్తున్న ఈ బుడ్డోడు ఇప్పుడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్.. ఎవరో గుర్తుపట్టగలరా?
డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ, హీరోయిన్ మాత్రం ఖరారు అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూతురు ఇందులో హీరోయిన్ గా నటించబోతుంది అట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుందని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రమేష్ బాబు కూతురు ఫోటోలు కూడా సోషల్ మీడియా లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటి తరం హీరోయిన్స్ తో పోలిస్తే ఆమె వెయ్యి రెట్లు ఎంతో బెటర్ గా అనిపిస్తుంది. తొలిసినిమా లో వీళ్లిద్దరి జంట చూసేందుకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది. మంచి సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు వస్తే మాత్రం వీళ్లిద్దరు మొదటి సినిమాతోనే కుంభస్థలం బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు.