Balakrishna Gopichand Malineni Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ల నుంచి వచ్చే సినిమాలు బీ,సీ సెంటర్లో ఉన్న ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. అలాగే ఆ సినిమాలు భారీ కలెక్షన్స్ కొల్లడానికి చాలావరకు దోహదపడుతూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే గోపీచంద్ మలినేని లాంటి దర్శకుడు కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తున్నాడు… ఇక ప్రస్తుతం ఆయన బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. గతంలో వీళ్ళ కాంబినేషన్లో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందంటూ అభిమానులు సైతం వాళ్ళ అభిపాయాల్ని తెలియజేయడంతో మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయింది…
అయితే ముందుగా వీళ్లు హిస్టారికల్ బ్యాడ్రాప్ లో ఒక భారీ అడ్వెంచర్ సినిమాని చేయాలనే ప్రణాళికలను రూపొందించుకున్నప్పటికి రీసెంట్ గా బోయపాటి డైరెక్షన్లో బాలయ్య బాబు చేసిన అఖండ 2 సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో ఆ సినిమాకి నష్టలైతే వచ్చాయి.
ఇక అంత పెద్ద బడ్జెట్ లో సినిమాను చేసి ఒకవేళ అది ఆడక పోతే ప్రొడ్యూసర్స్ కి ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాలయ్య ఒక కమర్షియల్ సినిమాని చేద్దామని గోపీచంద్ మలినేని కి చెప్పారట. దాంతో ప్రస్తుతం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ రెడీ చేయించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక మార్చి నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా గోపీచంద్ మలినేని ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.లేకపోతే మాత్రం చాలా వరకు వెనుకబడి పోయే ప్రమాదం కూడా ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో మరోసారి బాలయ్య సూపర్ సక్సెస్ ను అందుకొని హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది…