https://oktelugu.com/

Hatrick Heroines: హ్యట్రిక్ తో ఆ హీరోయిన్ల రికార్డును సమం చేసిన ‘ఉప్పెన’ బ్యూటీ..!

Hatrick Heroines: టాలీవుడ్లో హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హీరో హీరోయిన్లు ఒక్క హిట్ కొట్టడమే గమనమై పోయింది. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఓటమి ఎరుగకుండా హ్యట్రిక్ విజయాలు సాధిస్తూ ఇండస్ట్రీలో కొత్త రికార్డులను నమోదు చేస్తుండటం విశేషం. ఆ లిస్టులో ఇప్పుడు ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి కూడా తాజాగా చేరిపోయింది. హ్యాట్రిక్ విజయాలతో కృతిశెట్టి టాలీవుడ్లో గోల్డెన్ హీరోయిన్ గా కీర్తించబడుతోంది. కృతిశెట్టి కంటే ముందు ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 17, 2022 / 01:22 PM IST
    Follow us on

    Hatrick Heroines: టాలీవుడ్లో హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హీరో హీరోయిన్లు ఒక్క హిట్ కొట్టడమే గమనమై పోయింది. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఓటమి ఎరుగకుండా హ్యట్రిక్ విజయాలు సాధిస్తూ ఇండస్ట్రీలో కొత్త రికార్డులను నమోదు చేస్తుండటం విశేషం. ఆ లిస్టులో ఇప్పుడు ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి కూడా తాజాగా చేరిపోయింది.

    హ్యాట్రిక్ విజయాలతో కృతిశెట్టి టాలీవుడ్లో గోల్డెన్ హీరోయిన్ గా కీర్తించబడుతోంది. కృతిశెట్టి కంటే ముందు ఈ ఫీట్ ను మలాయళీ భామ అనుపమ పరమేశ్వరన్, సమంత ప్రభు సాధించారు. అనుపమ పరమేశ్వర్ విషయానికొస్తే.. 2016లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ’ మూవీతో అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది.

    ఆ వెంటనే నాగచైతన్యతో ‘ప్రేమమ్’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించారు. ఆ తర్వాత వచ్చిన  ‘శతమానం భవతి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆమె తొలి మూడు సినిమాలు వరుస విజయాలు సాధించడంతో అనుపమ హ్యట్రిక్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

    సమంత ప్రభు నటించిన తొలి మూవీ ‘ఏం మాయ చేశావే’ తెలుగులో బిగ్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘బృందావనం’లో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే మహేష్ బాబుతో ‘దూకుడు’లో నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో సమంత సైతం హ్యట్రిక్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

    ఆ తర్వాత వచ్చిన ‘ఈగ’ సమంత కెరీర్ నే మర్చివేసింది. వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి డబుల్ హ్యట్రిక్ హీరోయిన్ గా సమంత  మరో రికార్డును నెలకొల్పింది. సమంత కెరీర్లో ఇప్పటిదాకా సరైన ఫ్లాప్ ఇంత వరకు లేదనే చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా టాలీవుడ్ కు పరిచయమైన కృతిశెట్టి సైతం హ్యట్రిక్ విజయాలు సాధించి కెరీర్లో దూసుకెళుతోంది. ఆమె నటించిన ‘ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఈ భామ కూడా అనుపమ, సమంతల పక్కన చేరిపోయి స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది.