NTR
NTR: ఎన్టీఆర్.. ఈ పేరంటే ఓ బ్రాండ్.. ఈ హీరో సినిమా వస్తుందంటే థియేటర్లు బద్దలవుతుంటాయి. బాక్సాఫీస్ లెక్కలు భారీగా వస్తుంటాయి. అయితే ఈ స్టార్ హీరో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గుర్తింపు పొంది.. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించేలా చేసుకున్నారు. దీంతో ఈయన రేంజ్ ఇప్పుడు ఎల్లలు దాటిందనే చెప్పాలి.
ప్రస్తుతం ఈ స్టార్ హీరో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈయనకు జంటగా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, అప్డేట్స్ అంచనాలను పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ స్టార్ హీరోకు సంబంధించిన ఓ అప్డేట్ ఫ్యాన్స్ ను కవ్విస్తుంది. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఫోకస్ చేసి మరీ ఖుషీ అవుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు.
ఈ సినిమాతో ఎన్టీఆర్ తన స్టార్ ట్యాగ్ ను మార్చుకున్నారని తెలుస్తోంది. ఇన్ని రోజులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు ఆయన అభిమానులు. కానీ దేవర సినిమాతో ఈ ట్యాగ్ మారినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన పేరు మీద మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని రాసి ఉంది. అందరూ పిలుచుకున్నట్టు ఈ టైటిల్ తోనే రానున్నారు ఎన్టీఆర్. మొత్తం మీద దేవర సినిమాతో ఎన్టీఆర్ ఒక సరికొత్త ట్యాగ్ తో తన పాత ట్యాగ్ ను తొలగించుకొని మరీ రాబోతున్నట్టు టాక్. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తే.. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో..