Razakar Movie: తెలంగాణలో ఇటీవల సంచలనంగా మారింది ఓ సినిమా ట్రైలర్.. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ట్రైలర్ రిలీజ్ చేయడంతో అధికార బీఆర్‌ఎస్‌లో కలవరం మొదలైంది. ముఖ్యమైన మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి.. సినిమా ద్వారా తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని కూడా ప్రకటించారు. కానీ ఫిర్యాలు చేశారో లేదో తెలియదు కానీ, సినిమా ట్రైలర్ దశ దాటలేదు. దీంతో సినిమా రిలీజ్‌ను కావాలనే ఆపేశారా.. లేక ఆగిపోయిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు నెలల క్రితం ట్రైలర్..
బీజేపీ నేత గూడూరు నారాయణ తెలంగాణ నిర్మాతగా రజాకార్ సినిమాను తెలరకెక్కించారు. రజాకార్లు తెలంగాణలో సాగించిన మారణకాండను నేటి తరానికి తెలియజేసేలా సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మూడునెలల క్రితం సినిమా ట్రైలర్, పోస్టర్ రిలీజ్ చేసి సంచలనం రేపారు. తుపాకీ గుచ్చుకుని ఓ బ్రాహ్మణుడు మృతిచెందిన ఫొటో పోస్టర్‌లో, ట్రైలర్‌లో చూపడంతో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు, ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజాగా పాట రిలీజ్..
ఇక దరసరా పండుగ సందర్భంగా రజాకార్ సినిమా నుంచి బతుకమ్మ పాటను విడుదల చేశారు. అనసూయపై చిత్రీకరించిన ఈ సినిమాలోనూ రజకార్ల అకృత్యాలను వివరిస్తూ పాట సాగింది. దీంతో త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుందని అంతా భావించారు. ఎన్నికల వేళ ఈ సినిమా రిలీజ్ బీజేపీకి కలిసి వస్తుందని, బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఏం జరిగింతో తెలియదు, సినిమా రిలీజ్‌పై యూనిట్ మౌనంగా ఉండిపోయింది. ఇదిలా ఉంటే గూడూరు నారాయణ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సినిమా ఎందుకు ఆగిపోయిందో మాత్రం ఎవరూ చెప్పడం లేదు.